Homeక్రీడలుక్రికెట్‌TATA WPL 2026 Final: స్మృతి vs జెమీమా..WPL కప్ గెలవాలంటే ఆ బంధాన్ని పక్కన...

TATA WPL 2026 Final: స్మృతి vs జెమీమా..WPL కప్ గెలవాలంటే ఆ బంధాన్ని పక్కన పెట్టాల్సిందే!

TATA WPL 2026 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే బెంగళూరు జట్టు ఫైనల్ వెళ్లిపోయింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాతి జట్టును ఢిల్లీ జట్టు ఓడించింది. తద్వారా నాలుగోసారి ఫైనల్ వెళ్లిన ఘనతను ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. గురువారం వడోదర వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు తో ఢిల్లీ తలపడుతుంది. ఇప్పటివరకు ఢిల్లీ జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2024 లో ఢిల్లీ జట్టుపై ఫైనల్ […]

TATA WPL 2026 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే బెంగళూరు జట్టు ఫైనల్ వెళ్లిపోయింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాతి జట్టును ఢిల్లీ జట్టు ఓడించింది. తద్వారా నాలుగోసారి ఫైనల్ వెళ్లిన ఘనతను ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. గురువారం వడోదర వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు తో ఢిల్లీ తలపడుతుంది. ఇప్పటివరకు ఢిల్లీ జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2024 లో ఢిల్లీ జట్టుపై ఫైనల్ మ్యాచ్లో గెలిచి బెంగళూరు తొలిసారిగా విజేతగా ఆవిర్భవించింది.

బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో..
స్మృతి , జెమీమా గురించి స్పోర్ట్స్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇద్దరు కూడా భీకరమైన బ్యాటర్లు. పైగా వీరిద్దరి మధ్య ప్రాణ స్నేహం ఉంది. అలాంటప్పుడు ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరూ ఎలా ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది. వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుపై సెమీఫైనల్ మ్యాచ్లో జెమీమా సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. టీమిండియాను ఫైనల్ దాకా తీసుకెళ్ళింది. స్మృతి కూడా వన్డే వరల్డ్ కప్ లో అదరగొట్టింది.

స్మృతి వ్యక్తిగత జీవితం ఇబ్బందులలో పడినప్పుడు
జెమీమా అండగా నిలిచింది. ఆ సమయంలో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో ఆడే అవకాశాన్ని కూడా జెమీమా వదులుకుంది. దీనినిబట్టి వారిద్దరి మధ్య ఎంతటి గాఢమైన స్నేహం ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి మధ్య స్నేహబంధాన్ని సహచర ప్లేయర్లు “యిన్ అండ్ యంగ్” అని అభివర్ణిస్తారు.. స్మృతి ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటే.. జెమీమా దూకుడు అయిన తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. స్మృతి, జెమీమా తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఉల్లాసవంతమైన క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటారు. స్మృతిని “సుద్ద” అని జెమీమా పిలుస్తుంది. జెమీమా ను స్మృతి “జున్ను” అని సంబోధిస్తూ ఉంటుంది.

వీరిద్దరూ ఒకరి ఆటను ఒకరు ప్రశంసించుకుంటారు. తప్పు చేసినప్పుడు పరస్పరం లోపాలను ప్రస్తావించుకుంటారు. ఆ తర్వాత వాటిని అధిగమించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తారు. ప్రాణ స్నేహితులు అయినప్పటికీ.. ప్రత్యర్థులుగా పోటీ పడినప్పుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తుంటారు.

ప్రస్తుత ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్ల జాబితాలో స్మృతి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో స్మృతి ఎనిమిది ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసింది. 290 పరుగులు సాధించింది. ఇందులో ఆమె అత్యధిక స్కోరు 96 పరుగులు. స్మృతి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

జెమీమా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 13వ స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ కప్ లో ఆడినట్టుగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో జెమీమా ఆడలేక పోతోంది. 8 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన జెమీమా.. 207 పరుగులు చేసింది. ఇందులో ఆమెకు ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. హైయెస్ట్ స్కోర్ 51. స్మృతి రెచ్చిపోతున్న వేళ.. ఫైనల్ మ్యాచ్లో జెమీమా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper