https://oktelugu.com/

Yuvraj Singh: గుడ్ నైట్ అంటూనే.. ఇంగ్లాండ్ ప్లేయర్లకు 90 ఎంఎం రాడ్ దింపిన యువరాజ్ సింగ్

గయానా వేదికగా గురువారం సాగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ఎక్స్ లో సంచలన ట్విట్ చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 28, 2024 6:34 pm
    Yuvraj Singh

    Yuvraj Singh

    Follow us on

    Yuvraj Singh: 2022 t20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఎదురైన దారుణ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.. గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయం ద్వారా దాదాపు పది సంవత్సరాల అనంతరం t20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఏడాది వ్యవధిలోనే వరుసగా మూడు ఐసీసీ ఫైనల్స్ లోకి వెళ్లిన రికార్డును మూట కట్టుకుంది. సెమీస్ లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించడంతో.. టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. మాజీ ఆటగాళ్లు సైతం టీం ఇండియా విక్టరీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్.. టీమిండియా విజయాన్ని పురస్కరించుకొని ఇంగ్లాండ్ జట్టుకు సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా 90 ఎంఎం రాడ్ దింపాడు.

    గయానా వేదికగా గురువారం సాగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ఎక్స్ లో సంచలన ట్విట్ చేశాడు.. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసిన యువరాజ్ సింగ్… ఇంగ్లాండ్ ఆటగాళ్లను బామ్మర్దులూ అని సంబోధించాడు..” గుడ్ నైట్ బామ్మర్దులూ” అంటూ ట్వీట్ చేశాడు. యువరాజ్ సింగ్ బ్రిటిష్ మోడల్ హేజిల్ కీచ్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కీచ్ స్వస్థలం ఇంగ్లాండ్.. ఆమె అక్కడ ఓ నగరంలో జన్మించింది. అని పెళ్లి చేసుకోవడం ద్వారా యువరాజ్ సింగ్ కు ఇంగ్లాండ్ దేశంతో బంధుత్వం ఏర్పడింది.

    ఆ చనువు వల్లే ఇంగ్లాండ్ ఆటగాళ్లను అతడు “బామ్మర్దులూ” సంబోధించాడు. యువరాజ్ సింగ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. “నువ్వు గుండె ధైర్యం ఎక్కువున్న భర్తవని మాకు ఎప్పుడో తెలుసు యువీ పాజీ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, యువరాజ్ సింగ్ 2007 టి20 వరల్డ్ కప్ లో డర్బన్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆరు బంతులకు 6 సిక్సర్లు కొట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. టి20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పాడు.