https://oktelugu.com/

MS Dhoni: ధోని కొత్త లుక్ చూశారా? హాలీవుడ్ హీరోలు కూడా దిగదుడుపే..

ధోని కొత్త హెయిర్ స్టైల్ కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు అలిం హకీం ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నాడు. " యంగ్ అండ్ డైనమిక్, హ్యాండ్సమ్ మహేంద్రసింగ్ ధోని" అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ జత చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 28, 2024 6:39 pm
    MS Dhoni

    MS Dhoni

    Follow us on

    MS Dhoni: టీమిండియా కు టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోనిది. మైదానంలో చిరుతపులి లాగా పరిగెడతాడు. వికెట్ల వెనుక గోడ లాగా నిలబడతాడు. వెంట్రుక వాసి తేడాలో స్టంప్ అవుట్లు చేస్తాడు. లిప్త పాట కాలంలో క్యాచులు అందుకుంటాడు. కళ్ళు మూసి తెరిచేలోపే రనౌట్లు చేస్తాడు. సమకాలీన క్రికెట్లో ధోని ఒక బెంచ్ మార్క్ సృష్టించి వెళ్ళాడు. టీమిండియా జట్టు ప్రయాణాన్ని ధోనీకి ముందు, ధోనికి తర్వాత అని విభజిస్తారంటే అతిశయోక్తి కాదు. నాలుగు పదుల వయసు లో ఉన్నప్పటికీ ధోనిలో ఇంకా ఆ వాడి తగ్గలేదు.

    అందుకే ధోని కి ఇండియా వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల జరిగిన ఐపిఎల్ లో చెన్నై జట్టు తరుపున చివర్లో వచ్చి మైదానంలో విధ్వంసం సృష్టించి వెళ్ళాడు. సిక్సర్లు, ఫోర్లు కొట్టి.. తన స్టామినాను నిరూపించాడు. ఈ క్రమంలో మైదానాలు మొత్తం ధోని నామస్మరణతో మార్మోగి పోయాయి. ఆట మీదే కాదు ఫ్యాషన్ పై కూడా ధోనీకి విపరీతమైన మక్కువ. అందుకే తరచూ తన కేశాలంకరణ(హెయిర్ స్టైల్)ను మార్చుతూ ఉంటాడు. ఐపీఎల్ సీజన్లో గడ్డం, పొడవాటి జుట్టుతో ధోని కనిపించాడు. అప్పట్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇప్పుడు ధోని ఇప్పుడు ధోని మరో కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చాడు.

    ధోని కొత్త హెయిర్ స్టైల్ కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు అలిం హకీం ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ” యంగ్ అండ్ డైనమిక్, హ్యాండ్సమ్ మహేంద్రసింగ్ ధోని” అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ జత చేశాడు. ఆ ఫోటోలను అతడు పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది వీక్షించారు. హాలీవుడ్ హీరోలను మించి ధోని అందంగా కనిపిస్తున్నాడని అతడి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల కు గుడ్ బై చెప్పేశాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవల ఐపీఎల్లో చెన్నై జట్టు కెప్టెన్ బాధ్యత నుంచి పక్కకు తప్పుకున్నాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చాడు. 220 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. 161 పరుగులు చేశాడు. అయితే వచ్చే ఐపిఎల్ లో అతడు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అతడు ఆడతాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఐపిఎల్ కు విరామం ప్రకటిస్తే.. చెన్నై జట్టుకు మెంటార్ లేదా కోచ్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.