South Africa Vs India Final: అతడికి ఉద్వాసన.. సౌత్ ఆఫ్రికా తో ఫైనల్ మ్యాచ్ కు టీమిండియాలోకి కొత్త కుర్రాడు

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఒకవేళ విజేతగా ఆవిర్భవిస్తే.. ఓటమి ఎరుగని జట్టుగా.. ప్రపంచ కప్ అందుకుని రికార్డు సృష్టిస్తుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే.. దానికి కూడా ఇదే రికార్డు వర్తిస్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 6:39 pm

South Africa Vs India Final

Follow us on

South Africa Vs India Final: టి20 ప్రపంచ కప్ ను దక్కించుకునేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు ఫైనల్ లోకి దూసుకెళ్లింది. గురువారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సమష్టి ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ పై 68 పరుగుల తేడాతో విక్టరీని సాధించింది. ఈ గెలుపు నేపథ్యంలో శనివారం బ్రిడ్జి టౌన్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.. అటు సౌత్ ఆఫ్రికా, ఇటు టీమ్ ఇండియా ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండానే ఫైనల్ దాకా వచ్చాయి. ఫైనల్ లో విజేతగా ఏ జట్టు నిలిచినా చరిత్రే అవుతుంది.

ఇక ఈ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఒకవేళ విజేతగా ఆవిర్భవిస్తే.. ఓటమి ఎరుగని జట్టుగా.. ప్రపంచ కప్ అందుకుని రికార్డు సృష్టిస్తుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే.. దానికి కూడా ఇదే రికార్డు వర్తిస్తుంది. టి20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఘనతను సొంతం చేసుకోలేదు. ఇక టి20 ప్రపంచ కప్ లో భారత్ – సౌత్ ఆఫ్రికా జట్లు ఆరుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా నాలుగుసార్లు, సౌత్ ఆఫ్రికా రెండుసార్లు విజయాలు సాధించాయి.

టీమిండియా కు ఫైనల్ మ్యాచ్ అత్యంత ముఖ్యమైనది కావడంతో.. జట్టులో అనేక మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. టి20 వరల్డ్ కప్ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదల టీమిండియాలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది. సూపర్ -8, సెమీఫైనల్ లో ఎటువంటి మార్పులు చేర్పులు చేపట్టని మేనేజ్మెంట్.. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం మార్పులు చేసేందుకు ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది..

సెమీఫైనల్ మ్యాచ్ లో శివం దూబే దారుణంగా విఫలమయ్యాడు. 0 పరుగులకే వెనుతిరిగి వచ్చాడు. అయితే అతడిని ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అతడి స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్లైన సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇవ్వాలని యోచిస్తుంది. ఓపెనర్ గా విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. యశస్వి జైస్వాల్ ను తుది జట్టులోకి తీసుకొని, ఓపెనర్ గా బరిలోకి దించాలని రోహిత్ భావిస్తున్నట్టు సమాచారం.

వన్ డౌన్ లో స్వేచ్ఛగా ఆడే విరాట్ కోహ్లీ.. ఓపెనర్ గా ఆడటంలో విఫలమవుతున్నాడు.. అది జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. ఇక ఒకవేళ జైస్వాల్ జట్టులోకి తిరిగి వస్తే.. కోహ్లీ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.. జడేజా ఫామ్ లో లేకపోయినప్పటికీ.. తనదైన రోజు అతడు బిగ్ మ్యాచ్ విన్నర్ గా అవతరిస్తాడు. అందువల్లే అతని జట్టులో కొనసాగిస్తున్నారు. ఇక అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ సెమి ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. యజువేంద్ర చాహల్, సిరాజ్ కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. జస్ ప్రీత్ బుమ్రా, హర్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ భారత పేస్ బాధ్యతను పంచుకుంటారు..

జట్టు అంచనా ఇలా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే/ యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, అక్షర పటేల్, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్.