Hardik Pandya Tears : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో తన ప్రారంభ గేమ్‌లో టీమిండియా అద్భుతం చేసింది. పాకిస్తాన్ తో ఓడిపోవాల్సిన మ్యాచ్ లో గెలిచింది. విరాట్ కోహ్లీతో కలిసి జట్టు విజయానికి బాటలు వేసి కీలకమైన నాక్ ఆడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్‌పై గెలుపు తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెక్కివెక్కి ఏడ్చేశాడు. దీనికి ఒక బలమైన కారణం ఉంది.

గేమ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో ఇంటర్వ్యూలో ఇలా ఎమోషనల్ తట్టుకోలేక హార్ధిక్ ఏడ్చేశాడు. హార్దిక్ విజయం గురించి వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘తన తండ్రి త్యాగం తన దేశం కోసం ఆడేందుకు ఎలా సహకరించిందో వివరిస్తూ హార్దిక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘నేను క్రికెట్ ఆడేందుకు నాన్న అవకాశం కల్పించడంతో ఇక్కడ ఉన్నాను. పిల్లల కోసం ఆయన చాలా త్యాగం చేశారు. మా కోసం ఊరిని వదిలి నగరానికి కుటుంబాన్ని మార్చారు. నా జీవితాంతం నాన్నకు రుణపడి ఉంటా’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ముగిసిన తర్వాత హార్దిక్ ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hardik dedicated this inning to his father…moments u love to see ❤️
You are a champion my bro @hardikpandya7 !!#nardik #INDvsPAK2022 #Worlds2022 pic.twitter.com/dqhSFNFM0m
— abhijit giri (@abhijitgiri32) October 23, 2022
హార్దిక్ పాకిస్తాన్ తో తొలి ఇన్నింగ్స్‌లో బాల్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ మిడిల్ ఓవర్లలో షాదాబ్ ఖాన్, హైదర్ ,మరియు మహ్మద్ నవాజ్‌లను అవుట్ చేసి కొన్ని కీలక వికెట్లు తీశాడు. బ్యాట్‌తోనూ రాణించాడు. 37 బంతుల్లో 40 పరుగులు చేసి విరాట్ కోహ్లీతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 159/8 పరుగులు చేసింది. షాన్ మసూద్ మరియు ఇఫ్తికర్ అహ్మద్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి పాకిస్థాన్ స్కోరును 150 పరుగుల మార్కును దాటించడంలో సహాయపడ్డారు.. వీరిద్దరూ ఒక్కో అర్ధ సెంచరీ సాధించారు. మసూద్ 42 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేయగా, ఇఫ్తికార్ 34 బంతుల్లో 51 పరుగులు చేశాడు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు తీశారు. పాకిస్తాన్‌ను ఒత్తిడిలోకి నెట్టారు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్‌ను విజయానికి చేరువ చేసేందుకు కఠినమైన ప్రారంభం నుంచి భారత్‌ను రక్షించారు. హార్దిక్ 37 బంతుల్లో 40 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత, కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఆటను ముగించాడు. కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక 50కి పైగా స్కోర్లు కొట్టిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టాడు. అద్భుతంగా ఆడిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
#INDvsPAK2022 #INDvPAK#ViratKohli
Hardik Pandya in tears while speaking about his father. https://t.co/kWjLqzfOf9— BOBjr (@superking1816) October 23, 2022