Anushka Sharma Virat : ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచకప్ టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను విరాట్ కోహ్లీ తన అద్భుత పర్ ఫామెన్స్ తో గెలిపించాడు. హార్ధిక్ పాండ్యాతో కలిసి గట్టెక్కించాడు. చివరి వరకూ క్రీజులో ఉండి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. జట్టు విజయంలో ఛేజింగ్ కింగ్ అని కోహ్లీ అనిపించుకున్నాడు.

టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గెలిపించాక కోహ్లీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోహ్లీని భుజాలపైకి ఎత్తి కెప్టెన్ రోహిత్ గిరగిర తిప్పాడు. స్టేడియంలోని జనాలు, టీవీ చూసిన ప్రేక్షకులు కోహ్లీని వేయినోళ్ల పొగుడుతున్నారు.
టీమిండియాను గెలిపించిన కోహ్లీపై ఆయన భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. జట్టుకు విజయాన్ని అందించినందుకు దేశ ప్రజలకు ముందుగానే దీపావళి పండుగ వచ్చిందని అభివర్ణించింది. క్రికెట్ ప్రేమికుల కళ్లల్లో నిజమైన దీపావళి వెలుగులు తీసుకువచ్చారని ప్రశంసించారు. ‘‘మీరు చాలా అద్భుతంగా ఆడారు. మీ పట్టుదల , సంకల్పం, నమ్మకం మనస్సులను కదిలించాయి. నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్ ను ఇప్పుడే చూశాను. మన పాప వామిక మ్యాచ్ చూసి గదిలో డ్యాన్స్ వేస్తోంది. తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఆమె అర్థం చేసుకుంది. నిలకడ లేదని నీపై వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ సాధించిన ఈ విజయం అపూర్వం.. ఈ గెలుపుతో మీరు మరింత బలంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ అనుష్క శర్మ ఎమోషనల్ పోస్టు చేశారు.
ఈ పోస్టులో ఆమె కోహ్లీకి నిలకడ లేదని గతంలో కెప్టెన్సీ పోయాక పక్కనపెట్టిన వైనాన్ని ఎత్తి చూపడం విశేషం. నాడు అనుష్క వల్లే విరాట్ ఫామ్ కోల్పోయి దిగజారాడని చాలా మంది తిట్టారు. మరి ఇప్పుడు అదే విరాట్ గొప్పగా ఆడుతుంటే అనుష్కకే ఆ క్రెడిట్ ఇస్తారా? అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విరాట్ ఫామ్ లో లేనప్పుడు అందరూ అనుష్క ని చాలా అభాసుపాలు చేశారు. దానికి విరాట్ చాలా బాధపడ్డాడు. మరి ఇప్పుడు తన పర్ పామెన్స్ కి అనుష్క ని మెచ్చుకుంటారా విమర్శకులు ? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అనుష్క తన పోస్టులోనూ విమర్శకులకు, కోహ్లీని అన్నవారికి గట్టి సమాధానం ఇచ్చినట్టైంది.