Ind vs Pak: ఇండియా vs పాకిస్తాన్ పై ఐసీసీ బ్లాక్ బస్టర్ ప్రోమో.. వైరల్

Ind vs Pak:మరికొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ మ్యాచ్ కోసం అందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆ ఉత్కంఠను మరింత పెంచేలా ఐసీసీ ప్రపంచంలోనే ఇదో పెద్దమ్యాచ్ అంటూ రెండు జట్ల ఆటగాళ్లతో ఒక ప్రోమో వీడియోను విడుదల చేసింది. బాహుబలి ట్రైలర్ ను మించి ఊపేస్తున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియా, […]

Written By: NARESH, Updated On : October 24, 2021 5:03 pm
Follow us on

Ind vs Pak:మరికొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ మ్యాచ్ కోసం అందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆ ఉత్కంఠను మరింత పెంచేలా ఐసీసీ ప్రపంచంలోనే ఇదో పెద్దమ్యాచ్ అంటూ రెండు జట్ల ఆటగాళ్లతో ఒక ప్రోమో వీడియోను విడుదల చేసింది. బాహుబలి ట్రైలర్ ను మించి ఊపేస్తున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియా, పాకిస్తాన్ అభిమానులకు కిక్ ఇచ్చేలా మాస్ మసాలా టీజర్ లా ఇది ఉర్రూతలూగిస్తోంది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ కు కౌంటర్ షురూ అయ్యింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం కనిపించేది ఈ దాయాదుల పోరులోనే.. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రపంచకప్ లలో పాకిస్తాన్ పై టీమిండియా ఓడింది లేదు. టీ20 8 మ్యాచ్ లలో 6 ఇండియా, 1 పాకిస్తాన్ గెలిచింది. ఒకటి టై అయ్యింది. ఈ రోజు ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా మారింది.

ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను మరింత ఉర్రూతలూగించడానికి ఐసీసీ సిద్ధమైంది. రెండు టీంలపై ఓ బ్లాక్ బస్టర్ టీజర్ రూపొందించి రిలీజ్ చేసింది. యాక్షన్ సినిమా టీజర్ లను మించి ఇది ఉత్కంఠ రేపుతోంది. అభిమానులకు కిక్ ఇచ్చేలా మాస్ మసాలాగా రూపొందించారు.

ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఐసీసీ రూపొందించిన 58 సెకన్ల ఈ ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో హై ఓల్టేజ్ ను మరింత పెంచే ఈ మ్యాచ్ తీవ్రతను మరింత పెంచేలా ఈ టీజర్ ఉంది.