India vs Pakistan: భారత్ పాకిస్తాన్ క్రికెట్ సమరం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. దీంతో దీనిపై అప్పుడే బెట్టింగులు మొదలయ్యాయి. రూ. కోట్లలో డబ్బులు చేతులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని కోసం వేదికలు కూడా ఖరారు చేసుకుంటున్నారు. దీంతో ఈ మ్యాచ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగినట్లుగానే పందేలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బంతి బంతికి ఓ రేటు పెట్టుకుని మరీ బెట్టింగులు నిర్వహించేందుకు రహస్య ప్రదేశాలను ఎంచుకున్నట్లు సమాచారం.

ప్రజల భావోద్వేగాలను క్యాష్ చేసుకునేందుకే రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఆన్ లైన్ వేదికగా బెట్టింగ్ నిర్వహణపై సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్ని బంతులు వేస్తారు? ఎన్ని వికెట్లు తీస్తారు? ఎన్ని పరుగులు చేస్తారు? అనే వాటిపై దేనికదే రేట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం. టీమిండియా జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లపై బెట్టింగులు ఎక్కువగా వేసే సూచనలు కనిపిస్తున్నాయి.
రికార్డులు చూస్తే వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ ఇండియాపై గెలిచిన సందర్భాలు లేవు. కానీ ఈ సారి మాత్రం పాక్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కూడా సరైన రీతిలో స్పందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మొత్తానికి మ్యాచ్ పై భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆటగాళ్ల మధ్య కూడా సమన్వయం పెరిగేందుకు ఇది దోహదపడుతుందని చెబుతున్నారు.
రెస్టారెంట్లు, హోటళ్లు పెద్ద స్రీన్లు ఏర్పాటు చేసి ఆటను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. దీంతో బెట్టింగ్ ల జోరు కూడా పెరగనుందని తెలుస్తోంది. ఒక్కో ఆటగాడిపై ఒక్కో విధంగా బెట్టింగ్ వేయడం తెలిసిందే. ఈ క్రమంలో 2017లో జరిగిన భారత, పాకిస్తాన్ మ్యాచ్ లో దాదాపు రెండు వేల కోట్ల బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించే విధంగా బెట్టింగుల జోరు కొనసాగనుందని పలువురు క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.