T20 World cup 2021: ధోని రవి శాస్త్రి మధ్య విబేధాలు ఇదిగో సాక్ష్యం ! దానికి కారణం కోహ్లీ నే

T20 World cup 2021: టీమిండియాకు గొప్ప శక్తినిస్తూ మెంటర్ గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని నియమించింది బీసీసీఐ. అతడి ఐడియాలతో కోహ్లీ టీంకు తిరుగు ఉండదు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే పాకిస్తాన్, న్యూజిలాండ్ లపై చిత్తుగా ఓడి సెమీస్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. అద్భుతం జరిగితేనే టీమిండియా సెమీస్ చేరగలదు. దాదాపు అవకాశాలు మూసుకుపోయాయనే చెప్పాలి. అయితే ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియా చేసిన ప్రయోగాలు అట్టర్ […]

Written By: NARESH, Updated On : November 2, 2021 7:27 pm
Follow us on

T20 World cup 2021: టీమిండియాకు గొప్ప శక్తినిస్తూ మెంటర్ గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని నియమించింది బీసీసీఐ. అతడి ఐడియాలతో కోహ్లీ టీంకు తిరుగు ఉండదు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే పాకిస్తాన్, న్యూజిలాండ్ లపై చిత్తుగా ఓడి సెమీస్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. అద్భుతం జరిగితేనే టీమిండియా సెమీస్ చేరగలదు. దాదాపు అవకాశాలు మూసుకుపోయాయనే చెప్పాలి.

dhoni ravishastri

అయితే ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియా చేసిన ప్రయోగాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అసలు ఈ ప్లాన్లు వేసింది మెంటర్ ధోనినా? కోచ్ రవిశాస్త్రినా..? లేక వీరిద్దరివి కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీవా? అన్నవి ఇప్పుడు అంతుబట్టడం లేదు.

ఈ క్రమంలోనే తాజాగా మ్యాచ్ జరుగుతుండగా టీమిండియా మెంటర్ ఎంఎస్ ధోని, కోచ్ రవిశాస్త్రి మధ్య జరిగిన సీరియస్ సంభాషణకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారి మధ్య ఏం చర్చ జరిగిందన్నది మాత్రం తెలియదు.. కానీ దీనిపై అభిమానులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ చర్చలో కోచ్ రవిశాస్త్రి మెంటర్ ధోనిని నిలదీస్తున్నట్టుగా తెలుస్తోంది. కోహ్లీ, ధోని, రవిశాస్త్రి మధ్య అంతా బాగా లేదనే వాస్తవం ఈ ఫొటోలతో తెలుస్తోంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టీమిండియా ఓటమి అనంతరం ధోని తన కూల్ నెస్ ను కోల్పోయాడని సమాచారం. ఈ క్రమంలోనే ధోని, రవిశాస్త్రి మధ్య సీరియస్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఫొటోల్లో కూడా ధోని సీరియస్ గా కనిపించడంతో ఆ వార్తలు నిజమేనంటున్నారు.

ధోని కోపానికి విరాట్ కోహ్లీనే కారణమని కొందరు అంటున్నారు. వరుణ్ చక్రవర్తి స్థానంలో అశ్విన్ ను ఎంపిక చేయకపోవడం.. హార్ధిక్ పాండ్యాను వద్దన్నా ఎందుకు ఆడించారనే దానిపై రవిశాస్త్రితో ధోని చర్చించినట్టు సమాచారం. ఇక రోహిత్ శర్మను బ్యాటింగ్ ఆర్డర్ లో డిమోట్ చేయడం వెనుక కూడా ధోని సీరియస్ అయినట్టు సమాచారం.

ఇక మెంటర్ గా తన సలహాలు కోహ్లీ వినడం లేదని బీసీసీఐకి ధోని ఫిర్యాదు చేసినట్టు మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో నిజం ఎంతనేది తెలియదు కానీ ఓటమి తర్వాత మాత్రం టీమిండియాలో లుకలుకలు మొదలైనట్టుగా ఆ ఫొటోలను బట్టి అర్థమవుతోంది.

పాకిస్తాన్ , న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు నవంబర్ 3న అప్ఘనిస్తాన్ తో మ్యాచ్ కు రెడీ అయ్యింది. మరో మూడు మ్యాచ్ లలో భారీ విజయాలు సాధించడంతోపాటు న్యూజిలాండ్ ఒక మ్యాచ్ లో ఓడిపోతేనే భారత్ కు సెమీస్ చాన్స్. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి: ChandraBabu Naidu Wedding Card: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?