ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హార్టికల్చర్ సర్వీస్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి రోజుగా ఉండనుంది.
మొత్తం 39 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జోన్1 లో ఉండగా ఇక్కడ 5 ఉద్యోగ ఖాళీలను తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ జోన్2 లో ఉండగా ఇక్కడ 13 ఉద్యోగ ఖాళీలను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్3 లో ఉండగా ఈ జిల్లాలలో 11 ఉద్యోగ ఖాళీలను, రాయలసీమ జిల్లాలలో 10 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం.
నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ సబ్జెక్ట్ లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
https://psc.ap.gov.in/(s(b3x3fnqkxjv1ooujfxbabltp))/default.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీ 250 రూపాయలు, పరీక్ష ఫీజు 120 రూపాయలుగా ఉంది. మిగిలిన అభ్యర్థులు మాత్రం పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.