spot_img
Homeక్రీడలుక్రికెట్‌Pakistan Cricket Team : భారత్ వాతలు మానలేదు.. పాకిస్థాన్ అందుకే బౌలింగ్ ఎంచుకుంది..

Pakistan Cricket Team : భారత్ వాతలు మానలేదు.. పాకిస్థాన్ అందుకే బౌలింగ్ ఎంచుకుంది..

Pakistan Cricket Team : 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అమెరికా పాకిస్థాన్ ను ఓడించింది. ఆ టోర్నీలో పాకిస్తాన్ లీగ్ దశ నుంచే ఇంటికి వచ్చింది. తద్వారా పాకిస్తాన్ పరువు పోయింది. అమెరికా లాంటి అనామక జట్టు చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ జట్టుపై తీవ్రమైన ఒత్తిడిని ఏర్పరిచింది. ఇప్పుడు భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగుతోంది. టీమిండియాలో పాకిస్తాన్ ఎలాగూ ఆడదు కాబట్టి.. పాకిస్తాన్ శ్రీలంక వేదికగానే ప్రత్యర్థి జట్లతో తలపడుతుంది.

టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్ తో పోటీ పడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 2024 వరల్డ్ కప్ లో అమెరికా చేతిలో ఎదురైన పరాభవం.. ఆ తర్వాత భారత్ చేతిలో కూడా ఓటమి ఎదురు కావడంతో పాకిస్తాన్ జట్టు లీగ్ దశనుంచే ఇంటికి వచ్చింది. అమెరికా చేతిలో ఓటమి.. భారత్ చేతిలో పరాజయం వెరసి పాకిస్తాన్ కు వాతలు మిగిలాయి.

శ్రీలంక వేదికగా తను ఆడుతున్న మ్యాచ్ లలో ఓడిపోకూడదని పాకిస్తాన్ భావిస్తోంది. మరోవైపు భారత్ తో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ రద్దు చేసుకుంది. దీంతో లీగ్ దశలో పాకిస్తాన్ ఆడే మూడు మ్యాచ్ లలో కచ్చితంగా విజయం సాధించాలి. అప్పుడే సూపర్ 8 దశకు చేరుకుంటుంది. లేనిపక్షంలో పాకిస్తాన్ ఈసారి కూడా ఇంటికి వెళ్తుంది. నెదర్లాండ్స్ పాకిస్తాన్ ఇప్పటివరకు టి20లలో రెండుసార్లు పోటీపడ్డాయి. రెండుసార్లు కూడా పాకిస్తాన్ గెలిచింది. ఇక వన్డేలలో ఏడుసార్లు పాకిస్తాన్ నెదర్లాండ్స్ తలపడగా.. ఏడుసార్లు కూడా పాకిస్తాన్ గెలిచింది.

నెదర్లాండ్స్ ఒకవేళ సంచలనం సృష్టించి పాకిస్తాన్ మీద గెలిస్తే కనుక.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో సమీకరణాలు ఒకసారిగా మారిపోతాయి. అంతేకాదు పాకిస్తాన్ తదుపరి రెండు మ్యాచ్లలో భారీపరుగుల వ్యత్యాసంతో విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు మిగతా జట్ల రన్ రేట్ కూడా పాకిస్తాన్ కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే పాకిస్తాన్ సూపర్ 8 దశకు చేరుకుంటుంది. ఒకవేళ పాకిస్తాన్ మూడు మ్యాచ్లు వరుసగా గెలిస్తే.. సూపర్ 8 కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. భారత జట్టుతో జరిగే మ్యాచ్ ను రద్దు చేసుకోవడంతో.. పాకిస్తాన్ అనవసరంగా సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుందని క్రికెట్ విశేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version