spot_img
Homeక్రీడలుRashid Khan game plan: ఆఫ్ఘనిస్తాన్.. ఈసారి నిశ్శబ్దంగా ఉంది.. రషీద్ ఖాన్ గేమ్ ప్లాన్...

Rashid Khan game plan: ఆఫ్ఘనిస్తాన్.. ఈసారి నిశ్శబ్దంగా ఉంది.. రషీద్ ఖాన్ గేమ్ ప్లాన్ ఏంటంటే..

Rashid Khan game plan: అక్కడ క్రికెట్ ఆడేందుకు అవకాశం అంతంత మాత్రమే. పైగా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఒకరకంగా దేశ ప్రభుత్వం నుంచి క్రికెటర్లకు పెద్దగా ప్రోత్సాహం ఉండదు. ప్రభుత్వపరంగా సౌకర్యాలు కూడా ఉండవు. అటువంటిచోట అతడు క్రికెట్ నేర్చుకున్నాడు. ఒక జట్టును ఏర్పరచుకున్నాడు. ఏకలవ్య శిష్యుడు మాదిరిగా తనను తాను మలచుకున్నాడు. తద్వారా ప్రపంచ స్థాయిలోనే గొప్ప బౌలర్గా ఆవిర్భవించాడు.

ఈ ఉపోద్ఘాతం మొత్తం ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గురించి. అతడు అద్భుతమైన బౌలర్. అదే స్థాయిలో బ్యాటింగ్ కూడా చేస్తాడు. అందువల్లే అండర్ డాగ్ గా పేరుపొందిన తన జట్టుకు అనేక విజయాలు అందించాడు. తద్వారా సంచలన ప్రదర్శనకు మారుపేరుగా మార్చాడు. 2023 వరల్డ్ కప్ లో ఏకంగా తన జట్టును సెమీఫైనల్ దాకా తీసుకెళ్లాడు.

సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ.. 2024 t20 వరల్డ్ కప్ లో తన జట్టు మెరుగైన ప్రదర్శన చేసేలా తర్ఫీదు ఇచ్చాడు. బౌలింగ్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. అందువల్లే రషీద్ ఖాన్ టి20 లలో ఉత్తమమైన బౌలర్ గా ఆవిర్భవించాడు. అయితే ఇప్పుడు రషీద్ ఖాన్ మౌనమునిగా మారిపోయాడు. తన జట్టును నిశ్శబ్దంగా మార్చేస్తున్నాడు. పెద్ద పెద్ద జట్లకు షాక్ ఇచ్చే విధంగా తన ఆటగాళ్లకు క్రికెట్లో నైపుణ్యం నేర్పుతున్నాడు .. రషీద్ కేవలం బౌలర్ మాత్రమే కాదు.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అంతకుమించి. అందువల్లే ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫేవరెట్ మాదిరిగా కనిపిస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే పెద్ద జట్లకు షాక్ ఇవ్వగల స్థాయి దాని సొంతం.

“మేము మామూలు ఆట ఆడాలి అనుకోవడం లేదు. గొప్ప లక్ష్యాలను ఈసారి నిర్దేశించుకున్నాం . వాటి ఆధారంగా మేము అడుగులు వేస్తున్నాం. ఈ అడుగులు ఎంత దూరమైనా వెళ్తాయి కావచ్చు. ఈ ప్రయాణంలో మేము విసుగు చెందాలని అనుకోవడం లేదు. ఇబ్బందులను ఎదుర్కొని గొప్పదారుల వైపు వెళ్లాలని భావిస్తున్నామని” రషీద్ ఖాన్ చెబుతున్నాడు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version