Asia Cup Ind Vs Pak: ఆసియా కప్ గతంలో ఎన్నడు లేనంతగా ఈసారి వివాదమైంది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వల్ల ఆసియా కప్ ప్రపంచ మీడియా లో కూడా ప్రస్తావ అంశంగా మారిపోయింది. వాస్తవానికి గతంలో జరిగిన ఆసియా కప్ లు ఎన్నడు ఇంత చర్చకు దారి తీయలేదు. కానీ ఈసారి మాత్రం భారత్, పాకిస్తాన్ తల పడిన ప్రతి సందర్భంలోనూ వివాదాలయ్యాయి. మీడియాలో ప్రధాన వార్తలయ్యాయి.
లీగ్ దశ ప్రారంభం కంటే ముందు ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీ లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు నక్వీ పాల్గొన్నారు.. ఆయన పాల్గొనడం మాత్రమే కాదు ప్లేయర్ లందరికీ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. చివరికి ట్రోఫీ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ పాకిస్తాన్ కెప్టెన్, టీమిండియా కెప్టెన్ పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
Hard to believe… this video seems completely AI-generated.
It’s important to verify its authenticity. pic.twitter.com/hAoKBNlzAS— Fahim Akhtar فہیم اختر (@speaktostar) September 29, 2025
ఎప్పుడైతే సోషల్ మీడియాలో పహల్గాం గురించి చర్చ మొదలైందో అప్పుడే టీమ్ ఇండియాలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని.. కనీసం వారి ముఖం కూడా చూడలేదని ఓ వర్గం వారు అభిప్రాయపడుతున్నారు. దానికి రుజువుగా సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఆసియా కప్ ట్రోఫీని ఆవిష్కరించినప్పుడు సూర్య కుమార్ యాదవ్ తో చేసిన కరచలనానికి సంబంధించిన వీడియోను చూపుతున్నారు. నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడితో షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఈరోజు వ్యతిరేకంగా ప్రవర్తించడం టీమ్ ఇండియా సారధికి చెల్లిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
At the start of tournament,
• Shook hands
• Eating together
• Walking together
• Did a photoshoot
• Talking with each other
• Shook hands with Mohsin NaqviAfter massive outrage in India, BJP and BCCI changed their script to fool people of India.pic.twitter.com/9yfif6ANBl
— Mohit Chauhan (@mohitlaws) September 29, 2025
ఒకవేళ దేశం మీద అంత ప్రేమ ఉండి ఉంటే ఆ రోజే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండాల్సిందని చెబుతున్నారు. ముందుగా షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆ తర్వాత నిరసనలు వ్యక్తం కావడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి, టీమిండియా సారథి, ఇతర ఆటగాళ్ల వైఖరిలో మార్పు వచ్చిందని.. అందువల్లే ఇదంతా జరిగిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. ఇలాంటి ద్వంద్వ విధానాలు పనికిరాని.. ఉగ్రవాదంపై అందరూ పోరాడుతున్నారని.. ఆ విషయంలో రెండు నాలుకల ధోరణి సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రోఫీ తీసుకోకుండా నిరాకరించడం మంచి పని అయినప్పటికీ.. ఈ పని మొదటి నుంచి కూడా చేసి ఉంటే ఈ రోజున భారత జట్టు మీద గౌరవం మరో తీరుగా ఉండేదని.. మొదట్లో ఒక తీరుగా.. ఆ తర్వాత మరొక తీరుగా వ్యవహరించడమే బాగోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.