India Vs Pakistan: అభిమానం కొంత పరిధి వరకు ఉంటేనే బాగుంటుంది. అది కట్టలు తెంచుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. పాపం పాకిస్తాన్ అభిమానులకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. ప్రతిసారి జట్టు మీద భారీ అంచనాలు పెట్టుకోవడం.. జట్టులో ఆటగాళ్లు కొంతమేర మెరుగ్గా ఆడితే రెచ్చిపోవడం.. ఆ తర్వాత తలవంచుకోవడం.. పాకిస్తాన్ అభిమానులకు ఎప్పటినుంచో ఉన్నదే. అయినప్పటికీ తమ జట్టు ఆటగాళ్ల మీద అభిమానం వారు చంపుకోలేరు. చివరికి తాము అభాసు పాలవుతున్న సరే పట్టించుకోరు.
ఇటీవల పాకిస్తాన్ జట్టు, భారత జట్టుతో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి 10 ఓవర్ల వరకు ఓవర్ కు 8 కి పైగా రన్ రేట్ తో పరుగులు తీసింది. ఆ తర్వాత వేగంగా వికెట్లు కోల్పోయింది. మొదట్లో భారత బౌలింగ్లో అంతగా పసలేదు. ఆ తర్వాత భారత బౌలర్లు రెచ్చిపోవడంతో పాకిస్తాన్ జట్టుకు చుక్కలు కనిపించాయి. చూస్తుండగానే వికెట్లు పడిపోవడంతో పాకిస్తాన్ ఒక మోస్తరు స్కోర్ మాత్రమే టీమిండియా ఎదుట ఉంచింది.
మోస్తరు పరుగులను చేదించడంలో టీమిండియా ఇబ్బంది పడింది. 20 పరిధిలో లోపే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ వికెట్ పడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రమే కాదు.. పాకిస్తాన్ అభిమానులు కూడా రెచ్చిపోయారు. ముఖ్యంగా మైదానం వెలుపల ఉండి మ్యాచ్ చూస్తున్న ఓ పాకిస్తాన్ అభిమాని అయితే రెచ్చిపోయాడు. ప్రపంచాన్ని జయించామని.. భారత జట్టును ఓడించామని అన్నట్టుగా వీరావేశాన్ని ప్రదర్శించాడు. ఒకానొక దశలో విచక్షణ మొత్తం కోల్పోయి భారత అభిమానుల ముందు తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత, కూడా అదేదారిని అనుసరించిన తర్వాత.. సూర్య కుమార్ యాదవ్ కూడా విఫలమైన తర్వాత.. పాకిస్తాన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కానీ ఇదే దశలో భారత ప్లేయర్లు తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దూబే అదరగొట్టారు. పాకిస్తాన్ జట్టుకు విజయాన్ని దూరం చేశారు. భారత్ గెలుపు వాకిట ఉన్నప్పుడు పాకిస్థాన్ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. అప్పటిదాకా మైదానంలో వీరావేశం ప్రదర్శించిన ఓ అభిమాని కుర్చీలో కూర్చొని తల పట్టుకున్నాడు. అతనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Pakistani fans after Abhishek Sharma’s wicket vs after loosing #AsiaCup pic.twitter.com/FkGau1hdBr
— JosD92 (@JosD92official) September 29, 2025