https://oktelugu.com/

Suryakumar Yadav : ఆ ప్లేయర్లకి అన్యాయం చేసిన మన సూర్యకుమార్ యాదవ్

ఇక మనకు బ్యాకప్ లో కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు అనే ఒక దైర్యం అయితే అందరిలో ఉంటుంది. ఇక అలాంటి ఆయన్ని పక్కన పెట్టి సూర్య కుమార్ యాదవ్ చాలా పెద్ద తప్పు చేశారంటూ సూర్య మీద చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2023 / 09:32 PM IST
    Follow us on

    Suryakumar Yadav : ఆస్ట్రేలియాతో ఆడిన 5 మ్యాచ్ లా టి20 సిరీస్ లో ఇండియన్ టీమ్ 4-1 తేడాతో ఆస్ట్రేలియన్ ఓడించి సిరీస్ ని కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ లో ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్ కూడా తనదైన రీతిలో పర్ఫమెన్స్ ఇచ్చి ప్రతి మ్యాచ్ ని విజయతీరాలకు చేర్చారు. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సిరీస్ కోసం బిసిసిఐ 17 మంది ఇండియన్ ప్లేయర్లను సెలెక్ట్ చేయగా అందులో 15 మంది మాత్రమే మ్యాచ్ లను ఆడారు.

    మిగిలిన ఇద్దరు ప్లేయర్లను అసలు ఏ మ్యాచ్ లో కూడా తీసుకోకుండా వాళ్ళని బెంచ్ కే పరిమితం చేశారు.వాళ్ళు ఎవరు అంటే శివం దుబే, వాషింగ్టన్ సుందర్… నిజానికి వీళ్ళిద్దరూ కూడా మంచి ఆల్ రౌడర్లు వీళ్లను ఒక మ్యాచ్ లో కూడా తీసుకోకపోవడం పట్ల కెప్టెన్ అయిన సూర్య కుమార్ యాదవ్ మీద నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియన్ టీం సిరీస్ ని కైవసం చేసుకుంది.

    అలాంటప్పుడు చివరి మ్యాచ్ లో వీళ్ళిద్దరిని ఆడిస్తే బాగుండేది అని సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా మీద ఇండియన్ టీం ఓడిపోవడానికి ముఖ్య కారణం సరైన ఆల్ రౌండర్ ప్లేయర్ లేకపోవడమే కారణం… హార్దిక్ పాండ్య కి ఎప్పుడైతే గాయం అయి ఆయన టీమ్ నుంచి వైదొలిగాడో ఇక అప్పటి నుంచి ఇండియన్ టీం తెలియకుండానే చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇక ఆయనకి ఆల్టర్నేట్ గా శివం దుబే లాంటి ఒక పేస్ బౌలింగ్ చేస్తూ ఆల్ రౌండర్ గా కొనసాగే ప్లేయర్ ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.

    ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక ఆల్ రౌండర్ ని హార్దిక్ పాండ్యకి బ్యాకప్ లో రెడీ చేసుకోవడం మంచిది.ఎందుకంటే 2024 లో జరిగే టి20 వరల్డ్ కప్ కి అయిన దూబే ని మనం రెడీ చేసి పెట్టుకుంటేనే ఏ ప్లేయర్ కి ఇబ్బంది అయినా కూడా బ్యాకప్ లో తనని మనం వాడుకోవచ్చు. ఇక మనకు బ్యాకప్ లో కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు అనే ఒక దైర్యం అయితే అందరిలో ఉంటుంది. ఇక అలాంటి ఆయన్ని పక్కన పెట్టి సూర్య కుమార్ యాదవ్ చాలా పెద్ద తప్పు చేశారంటూ సూర్య మీద చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు…