Arjun Tendulkar Wedding:
ప్రముఖ లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) నేడు ముంబై లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నాడు. ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు సానియా ఛందోక్ తో ఈ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ICC చైర్మన్ జైషా , టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లతో పాటు పలువురు క్రికెటర్లు ఈ పెళ్ళికి హాజరు కాగా, మన ఆంధ్ర ప్రదేశ్ నుండి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యాడు . అయితే సచిన్ టెండూల్కర్ కి అత్యంత సన్నిహుతులలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ఈ పెళ్ళికి హాజరు కాకపోవడం గమనార్హం . బహుశా ఆయన వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు అవ్వొచ్చని అంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ పెళ్ళికి సంబంధించిన కొన్ని లవ్లీ మూమెంట్స్ ని మీరు క్రింది వీడియో లో చూడొచ్చు.
ఇదంతా పక్కన పెడితే పెళ్లి కూతురు సానియా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సచిన్ కంటే అతని భార్య అంజలీ వయస్సులో పెద్ద అనే విషయం మన అందరికి తెలిసిందే. సచిన్ వయసు 52 కాగా, అంజలి వయస్సు 58 ఏళ్ళు . ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ విషయం లో కూడా ఇదే రేపేనా అయ్యింది. అర్జున్ 1999 వ సంవత్సరం , సెప్టెంబర్ 24 న జన్మించగా , సానియా 1998 వ సంవత్సరం జూన్ 23 న జన్మించింది. వీళ్లిద్దరి మధ్య ఏడాది గ్యాప్ ఉంది. అయితే వీళ్లది ప్రేమ వివాహమా ?, లేదంటే పెద్దలు కుదిరించిన వివాహమా అనే విషయం పై క్లారిటీ లేదు. ఒక సంవత్సరం ఎక్కువ వయస్సున్న అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి, ప్రేమ వివాహమే అయ్యుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్న పెళ్లి వీడియోని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
