https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ నామినేషన్స్ లో దారుణం.. నన్ను రా అంటావా.. రెచ్చిపోయిన ప్రశాంత్-అమర్..

హా అవును .. నన్ను పంపించేయండి .. వాడికి కప్పు ఇచ్చేయండి .. మీరందరు హ్యాపీగా ఉండండి అంటూ అమర్ నోటి కొచ్చినట్లు మాట్లాడాడు. ఇక తర్వాత అర్జున్ అమర్, యావర్ లను నామినేట్ చేసాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2023 / 07:27 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో 14వ వారం నామినేషన్ హీటెక్కిస్తున్నాయి . తాజా ప్రోమో గమనిస్తే అమర్ దీప్, ప్రశాంత్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ పై టాప్ లేచిపోయేట్టు కేకలేశాడు అమర్. ముందుగా అమర్ నామినేట్ చేస్తూ ‘రా ..మాట్లాడరా అని అనడంతో’ … నన్ను రా అనొద్దు అంటూ ప్రశాంత్ అన్నాడు. అంటారా .. రా అనే అంటా నా తమ్ముడు ఎలాగైనా పిలుస్తా నచ్చితే పలుకు లేకపోతే పో, అంటూ ఫైర్ అయ్యాడు.

    పల్లవి ప్రశాంత్ అమర్ కోసం మాటిచ్చాడు అని అమర్ అనడంతో .. అందుకే కదా గేమ్ లో నిన్ను కొట్టానా అంటూ ప్రశాంత్ అరిచాడు. మధ్యలో శోభా కల్పించుకుని ‘ ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్న ప్రశాంత్ సేఫ్ ప్లేయర్ వి అంటూ ఓవర్ చేస్తూ చెప్పింది. దీంతో ప్రశాంత్ ‘ అమర్ అన్న ఫస్ట్ నుంచి నా మీద నెగిటివ్ యే పెట్టుకున్నావు .. సాయం చేసిన మోసం చేసే గుణం నీది’ అంటూ ప్రశాంత్ రైజ్ అయ్యాడు.

    అవును రా .. నేను బ్యాడ్ బాయ్ .. నువ్వు లాగొద్దు, పాత విషయాలు తవ్వకు అంటూ అమర్ అరిచాడు. తవ్వుతా బారాబర్ తవ్వుతా అంటూ ప్రశాంత్ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో అమర్ ఛీ .. ఆపరా నీ అబద్దాలు అంటూ సుత్తి నేలకేసి కొట్టాడు. నీ కోసం నిలబడ్డోళ్లని నువ్వు మోసం చేసే గుణం నీది అంటూ రెచ్చిపోయాడు. అమర్ అన్న నన్ను ఎట్లా చేసాడో మీరే చూడండి అంటూ ప్రశాంత్ ఆడియన్స్ తో చెప్పాడు.

    హా అవును .. నన్ను పంపించేయండి .. వాడికి కప్పు ఇచ్చేయండి .. మీరందరు హ్యాపీగా ఉండండి అంటూ అమర్ నోటి కొచ్చినట్లు మాట్లాడాడు. ఇక తర్వాత అర్జున్ అమర్, యావర్ లను నామినేట్ చేసాడు. అర్జున్ ఇంకా యావర్ మధ్య మాట తూటాలు పేలాయి. తర్వాత శివాజీ .. ప్రియాంక ని నామినేట్ చేసాడు. ఇలా హాట్ హాట్ సాగాయి నామినేషన్స్. అయితే ఇప్పుడిప్పుడే అమర్ గ్రాఫ్ పెంచుకుని టైటిల్ రేస్ లో అడుగుపెట్టాడు. ఇలాంటి టైములో ప్రశాంత్ తో గొడవ పడటం అతనికి పెద్ద మైనస్ అవుతుందని చెప్పొచ్చు.