Suryakumar Yadav: టి20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి విజేతగా నిలిచింది. 2007 తర్వాత అంతర్జాతీయ వేదికపై రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ ను దర్జాగా దక్కించుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ మైదానం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 176 రన్స్ చేసింది. టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత. బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. కప్ అందుకుంది.. అయితే ఈ మ్యాచ్లో 19 ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని.. దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద టీమ్ ఇండియా ఫీల్డర్ సూర్య కుమార్ యాదవ్ రిలే క్యాచ్ అనుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ఐదు బంతులను హార్థిక్ కట్టుదిట్టంగా వేయడంతో టీమిండియా విజయం సాధించింది.
టీమిండియా సాధించిన ఈ విజయంలో సూర్య కుమార్ యాదవ్ పాత్ర కీలకంగా ఉంది. సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతోంది. రోహిత్ శర్మ నుంచి రాహుల్ ద్రావిడ్ వరకు సూర్య కుమార్ పట్టిన క్యాచ్ ను కొనియాడారు. “అతడు తుఫాన్ వేగంతో ఫీల్డింగ్ చేశాడు. అందువల్లే చివరి ఓవర్ లో మ్యాచ్ టీమ్ ఇండియా వైపు మొగ్గింది. అతడు పట్టిన క్యాచ్ ను టీమ్ ఇండియా మాత్రమే కాదు, క్రికెట్ అభిమానించే ప్రతి ఒక్కరు చాలా సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకుంటారని” వ్యాఖ్యానించారు..
టీమిండియా మ్యాచ్ గెలిచిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ టి20 ప్రపంచ కప్ ను తన బెడ్ పై కౌగిలించుకొని పడుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. వాస్తవానికి సౌత్ ఆఫ్రికా గెలిచేందుకు చివరి ఓవర్లో 16 పరుగులు కావాలి. క్రీజ్ లో ప్రమాదకరమైన డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఆ చివరి ఓవర్ వేసే బాధ్యతను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. హార్థిక్ పాండ్యా వేసిన తొలి బంతిని మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. అది గాల్లోకి లేచింది. స్టాండ్స్ వైపు దూసుకెళ్లింది. లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ లో ఉన్న సూర్య వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి.. అనితర సాధ్యమైన స్థాయిలో బౌండరీ లైన్ వద్ద బంతిని పట్టేసుకున్నాడు. తిరుగులేని రిలే క్యాచ్ అందుకొని అబ్బురపరిచాడు. ఆ క్యాచ్ తర్వాత మ్యాచ్ గమనం భారత్ వైపు సాగింది. ఒకవేళ సూర్య ఆ క్యాచ్ కనక పట్టి ఉండకుంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది.
ఇక సూర్యకుమార్ యాదవ్ బెడ్ పై ట్రోఫీని కౌగిలించుకొని పడుకున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ” టి20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందం సూర్యకుమార్ యాదవ్ ను పడుకునే సమయంలో కూడా వదలడం లేదు. ఆ అద్భుతమైన అనుభూతి నుంచి అతడు బయటికి రావడం లేదు. అందుకే ట్రోఫీని కూడా తన బెడ్ పై పెట్టుకొని పడుకుంటున్నాడు. ఒక ఆటగాడికి ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది.. ఆటను ఎక్కువగా ప్రేమిస్తేనే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Suryakumar Yadav & his wife with T20I World Cup Trophy. pic.twitter.com/rGCIJA6uHE
— Johns. (@CricCrazyJohns) June 30, 2024