Heroine: అలా ప్రవర్తించి అడ్డంగా బుక్కైన హాట్ హీరోయిన్

Heroine: షూటింగ్స్ లో చిన్న చూపు ఉంటుందని.. కొన్ని సార్లు చేదు అనుభవాలు కూడా ఎదురు అవుతుంటాయి అని టాక్. ఇదే విధంగా హీరోయిన్ అమలా పాల్ నడుచుకుందని అంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ హేమ.

Written By: Swathi, Updated On : July 1, 2024 12:14 pm

Celeb Hairstylist Hema Reveals Dark Side Of Amala Paul

Follow us on

Heroine: వెండితెర, బుల్లితెర మీద నటీనటులు అందంగా కనిపించాలంటే దాని వెనక మేకప్, హెయిర్ స్టైలిస్టుల పాత్ర చాలా ఉంటుంది. పాత్రకు తగినట్టు అందంగా రెడీ చేసి ఆడియన్స్ ను నచ్చేలా చేస్తారు. చాలా ఓపికగా మేకప్, హెయిర్, చీరలు, డ్రెస్ ల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. కానీ వారి విషయంలో షూటింగ్స్ లో చిన్న చూపు ఉంటుందని.. కొన్ని సార్లు చేదు అనుభవాలు కూడా ఎదురు అవుతుంటాయి అని టాక్. ఇదే విధంగా హీరోయిన్ అమలా పాల్ నడుచుకుందని అంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ హేమ.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ తనకు జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. ఒకసారి అమలాపాల్ తో కలిసి చెన్నైలో షూటింగ్ కు వెళ్లిందట. హేమకు అమలాపాల్ గురించి తెలియదట. ఓ స్నేహితుడు చెబితే వెళ్లిందట. ఏప్రిల్, మేలో షూటింగ్ కు వెళ్లారట. కానీ ఆ సమయంలో చాలా ఎండ, వేడిగా ఉందని తెలిపింది. కనీసం నీడ కావాలని చూస్తే ఒక చెట్టు కూడా కనిపించలేదట. అందుకే అక్కడే ఉన్న వ్యానిటీ వ్యాన్ లోపలికి వెళ్లారట. అందులో రెండు భాగాలు ఉన్నాయని పేర్కొంది.

కళాకారులు కూర్చోవడానికి ఒకటి, మరొకరి టెక్నికల్ టీం ఉండటానికి కేటాయించారట. వీళ్లు కూర్చోగానే అమలా పాల్ మేనేజర్ వచ్చి వారిని బయటకు వెళ్లిపొమ్మని అక్కడ కూర్చోవడానికి వీల్లేదని చెప్పారట. ఈ హెయిర్ స్టైలిష్ట్ హేమ, మేకప్ ఆర్టిస్టు ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకొని బాధ పడ్డారట. అంత వేడిలో బయటకు వెళ్లలేకనే వెళ్లామన తలుచుకొని బాధ పడింది.

దక్షిణాదిలో ఎలా పనిచేస్తారో తనకు తెలియదని.. వ్యానిటీ వ్యాన్ లోపలికి హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్టులు రాకూడదనే నియమాలు ఉన్నాయా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సౌత్ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్ లకు విలువ ఇవ్వరంటూ బాధ పడింది. అయితే తాను టబు వంటి వారి దగ్గర పనిచేసిందట. కానీ టబు తనను బాగా చూసుకున్నారట. మేకప్, హెయిర్ ఆర్టిస్టుల కోసం టెక్నికల్ టీమ్ కోసం వ్యాన్ బుక్ చేస్తారట కొందరు. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఉందంటూ తెలిపింది. ఇది విన్న నెటిజన్లు అమలాపాల్ యాట్టిట్యూడ్ మీద విమర్శలు చేస్తున్నారు.