SRH Vs RCB 2024
SRH Vs RCB 2024: ఐపీఎల్ –2024లో ఒక్కో జట్టును చిత్తు చేస్తూ బ్రేకులు లేని శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఈ సీజన్‌లో వణికించింది కమిన్స్ సేన. ఇక ఇప్పుడు ఆర్సీబీని ఓ పట్టుపట్టేందుకు సిద్ధమవుతోంది. ఉప్పల్ వేదికగా ఏప్రిల్ 25న జరుగనున్న మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే అత్యధిక పరుగులు(300) చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో 250కు పైగా స్కోర్లు మూడుసార్లు బాది ఊపు మీద ఉన్న ఆరెంజ్ ఆర్మీ.. ఆర్సీబీతో మ్యాచ్‌లో 300 లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో తమ లక్ష్యం 300 అని జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ వ్యూహరచన చేస్తున్నాడని తెలుస్తోంది.
ఏంటా వ్యూహం..
ఆర్సీబీతో మ్యాచ్‌లో కొత్త స్ట్రాటజీతో బరిలో దిగాలని ఎస్‌ఆర్‌హెచ్ సారధి కమిన్స్ ప్లాన్ చేస్తున్నాడట. జట్టులో బ్యాటర్లు అంతా ఫాస్ట్‌గా ఆడుతున్నారు. ఓపెనర్లు హెడ్, అభిషేక్ నెక్ట్స్ లెవల్ ఫామ్‌లో ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ వేగంగా పరుగులు చేస్తున్నారు. నితీశ్‌కుమార్‌రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ ఛాన్స్ దొరికినప్పుడల్లా తమ ప్రతాపం చూపిస్తున్నారు. అయితే ఒక్క ఎయిడెన్ మార్క్రమ్ మాత్రమే నార్మల్ గేమ్ ఆడుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నా.. ప్రస్తుతం జట్టులో ఉన్న హిట్టర్స్ ముందు తేలిపోతున్నాడు. అందుకే మార్క్రమ్ స్థానంలో పరుగుల రాక్షసుడ్ని దింపాలని నిర్ణయించుకున్నాడట కమిన్స్. కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ను ఆడించేందుకు ఇదే సరైన సమయమని కెప్టెన్ భావిస్తున్నాడట. ఇందుకు జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఓకే చెప్పిందని సమాచారం.
ఫిలిప్స్ వస్తే..
స్లోగా ఆడుతున్న మార్క్రమ్ ప్లేస్‌లో ఫిలిప్స్ వస్తే ఎస్‌ఆర్‌హెచ్ సైన్యానికి మరో భారీ హిట్టర్ దొరికినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. హెడ్, అభిషేక్ ఎలాగూ మంచి ఓపెనింగ్ ఇస్తున్నారు. మూడో స్థానంలో ఫిలిప్స్ కూడా చెలరేగితే మిగతా పనిని తర్వాత వచ్చే క్లాసెన్, ఇతర బ్యాటర్లు చూసుకుంటారని కమిన్స్ భావిస్తున్నాడు.
అదనపు బౌలర్ కూడా..
ఇక ఫిలిప్స్ జట్టులోకి వస్తే టీంకు అదనంగా మరో బౌలర్ కూడా దొరికినట్లు అవుతుందని కెప్టెన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఫీల్డింగ్‌లో ఈ కివీస్ స్టార్ పెద్ద తోపు. ఫిలిప్స్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని తెలిసిన నెటిజన్స్ ఉన్న విధ్వంసకారులు చాలక.. ఫస్ట్ బాల్ నుంచే విరుచుకుపడే రాక్షసుడిని తీసుకొస్తున్నారా? ఇక ఆర్సీబీ పని అంతే అంటూ కామెంట్ చేస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sunrisers hyderabad vs royal challengers bangalore playing 11 updates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com