IPL 2022: అప్పుడెప్పుడో 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ కప్ కొట్టింది. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరడం ఓడిపోవడం.. పోయిన సారి అయితే మొత్తం ఓటములతో అట్టడుగున నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వచ్చే సీజన్ లో మెగా వేలం జరుగబోతోంది. ఇప్పటివరకూ ఆయా టీంలకు ఆడుతున్న ఆటగాళ్లలో కేవలం నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవచ్చు. మిగతా అందరినీ వేలంలోకి వదలవచ్చు. ఈ మెగా వేలంలో పంజాబ్ ఇప్పటికే ఎవ్వరిని అట్టిపెట్టుకోకుండా అందరిని వదిలించుకుంది. కప్ కొట్టని ఆటగాళ్లు వద్దు అనుకొని వేలంలోకి వదిలేసింది.
sun risers hyderabad
ఇప్పుడు పంజాబ్ బాటలోనే సన్ రైజర్స్ కూడా షాక్ ఇచ్చింది. గత ఐపీఎల్ లో వరుస ఓటములతో అట్టడుగున నిలిచిన సన్ రైజర్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోవడం అందరినీ మెగా వేలంలోకి వదిలేస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో ఐపీఎల్ లో సంచలనమైంది. ప్రకంపనలు సృష్టిస్తోంది.
సన్ రైజర్స్ కు డేవిడ్ వార్నర్, విలియం సన్, బెయిర్ స్టో, భువనేశ్వర్, రషీద్ ఖాన్ లాంటి హేమాహేమీలున్నారు. వీరిలో ఒక్కరిని కూడా సన్ రైజర్స్ అంటిపెట్టుకోకపోవడం ఐపీఎల్ లో సంచలనమైంది.
Also Read: జట్టులో ఉండేదెవరో తేలేది నేడే..!
ఇప్పటికే కేఎల్ రాహుల్ పంజాబ్ ను వదిలేసి వేలంలోకి వచ్చాడు. సన్ రైజర్స్ రషీద్ ఖాన్ కూడా బేరం ఆడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కే ప్లేయర్ ఆయా ఫ్రాంచైజీలకు షాకిస్తూ బయటకు వస్తున్నారు. ఫ్రాంచైజీలు సైతం నమ్మకంగా ఉన్న ఆటగాళ్లను వదిలేస్తూ వారికి షాక్ లు ఇస్తున్నాయి.
తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాము ఎవ్వరిని అంటిపెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. ఇన్ని సంవత్సరాలుగా టీం కోసం కష్టపడ్డ ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. ఇది గుడ్ బై మాత్రమే కాదు.. మెగా ఆక్షన్ ద్వారా మీలో కొంతమందిని సన్ రైజర్స్ తిరిగి దక్కించుకుంటుంది అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఆటగాళ్లందరినీ వదిలించుకుందని అర్థమవుతోంది. మరి అందరు కొత్తవాళ్లతో సన్ రైజర్స్ టీం ఎలా టీంను రూపొందించుకుంటుందన్నది వేచిచూడాలి.
We thank the players for their contribution to SRH over the years. This is not a goodbye, as we hope to welcome back some Risers in the auction 🧡#ForeverOrange pic.twitter.com/imZmqNCpIm
— SunRisers Hyderabad (@SunRisers) November 30, 2021
Also Read: హతవిధీ.. ఒక్క వికెట్ తీయలేక ఓడిన భారత్