NTRUHS Recruitment: ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్) వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 15 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 15 ఉద్యోగ ఖాళీలలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (03), కంప్యూటర్ ఆపరేటర్ (10), డేటా ఎంట్రీ ఆపరేటర్ (02) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
సీఎస్‌ఈ/ ఐటీ/ ఈసీఈ సబ్జెక్టుల్లో బీటెక్ పాసైన వాళ్లు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు డిగ్రీ (కంప్యూటర్స్)/ ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ పాసై రెండేళ్ల అనుభవాన్ని కలిగి ఉండాలి.
Also Read: తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ పాసై ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పక్కన, విజయవాడ-520008, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. http://ntruhs.ap.nic.in/index.html వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: సిరివెన్నెల కుమారులు ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉన్నారని మీకు తెలుసా?