IPL Auction: ఐపీఎల్ అంటే మన దేశంలో పెద్ద పండగ సీజన్ లాంటిది. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఐపీఎల్‌కోసం ఈరోజు మెగా వేళం జరుగుతోంది. రేపు కూడా వేళం ఉంటుంది. కాగా ఇందులో చాలామంది ఆటగాళ్లు భారీ స్థాయిలో అమ్ముడు పోగా.. స్టార్ క్రికెటర్లు కొందరు మాత్రం అమ్ముడుపోకపోవడం విచిత్రంగా ఉంది. తొలి రౌండ్ లో వారు అమ్ముడు పోలేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్‌లో రైనాకు ఉన్న హిస్టరీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిస్టర్ ఐపీఎల్ గా పేరొందిన ఈ స్టార్ ఆటగాడు.. తొలి రౌండ్‌లో ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పటి వరకు సీఎస్‌కే విజయాల్లో కీలకంగా ఉన్న రైనాను.. చివరకు సీఎస్‌కే కూడా బిడ్ వేయలేదు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్ ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇతనికి ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది.
Also Read: ఆ హీరోయిన్ పాకిస్థానీ బిచ్చగత్తె అట !
ఇక మరో స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ను కూడా ఎవరూ కొనలేదు. ఇతను గతంలో ఐపీఎల్ లో కెప్టెన్ గా కూడా చేశాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో కూడా ఉన్నారు. అయినా అతన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదుబంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎప్పటి నుంచో ఐపీఎల్ ఆడుతున్నాడు. అతనికి మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. కానీ ఈ సారి అతనికి కూడా షాక్ తగిలింది.

పైన పేర్కొన్న వారందరూ కూడా స్టార్ ఆటగాళ్లు. ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డు ఉన్న రారాజులే. అయినా కూడా ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం షాక్. కొత్తగా వచ్చిన కుర్రాళ్లను ప్రాంచైజీలు ఎగబడి మరీ కొంటున్నాయి. కానీ ఇంతటి సీనియార్టీ ఉన్న వారిని మాత్రం తొలిరౌండ్‌లో కొనుగోలు చేయకపోవడం విశేషం. ఇక రేపు కూడా వేలం వేస్తారు. ఒకవేళ ప్రాంచైజీలు కోరుకుంటే.. యాక్సెలెటరీలో వీరికి అవకాశం ఉంటుంది. మరి రేపు వీరిని ఎవరైనా కొనుగోలు చేస్తారో లేదో చూడాలి.
Also Read: ప్రభాస్ ఇంతలా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వలేదు !