Instagram: ప్రస్తుతం ఉన్నదంతా సోషల్ మీడియా యుగమే. ఏది చెప్పాలన్నా సరే సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి సోషల్ మీడియా యాప్ లలో ఇన్ స్టా గ్రామ్‌ది సెపరేటు లెవల్. అయితే ఈ ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటి వరకు ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది క్రిస్టియానో రొనాల్డో గురించి.

పోర్చుగీస్ కు చెందిన ఈ ఫుట్‌బాల్ స్టార్ కు ఇన్ స్టాలో 400 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే దాదాపు 40కోట్ల మంది అన్న మాట. ఇతనికి 2021 వరకు 237 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. కానీ ఆరు నెలల్లోనే 400 మిలియన్లకు చేరుకోవడం ఇక్కడ విశేషం. ఈ ఆరు నెలల్లోనే దాదాపు 163 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు.
Also Read: కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న రోజా.. కారణమేంటబ్బా..?
ఇక ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాకు 469 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఇందులో దాదాపు 7049 పోస్టులు పెట్టింది ఈ ఇన్ స్టా గ్రామ్ అధికారిక ఖాతా. అయితే ఇది వ్యక్తి కాదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా క్రిస్టియానో రొనాల్డోకి మొదటి స్థానం ఇచ్చేసింది. ఇక అతని తర్వాత స్థానంలో కైల్ జెన్నర్ ఉన్నాడు. అతనికి 309 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
వీరిద్దరి తర్వాత ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ 306 మిలియన్లు ఫాలోవర్లతో ఉన్నాడు. సెలీనా గోమేజ్‌కు కూడా దాదాపు 395 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో డ్వైన్ ద రాక్ జాన్సన్ కూడా 295 మిలియన్లు మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. అరియానా గ్రాండేకు 294 మిలియన్ల మంది ఉండగా.. కిమ్ కార్డాషియాన్‌కు 284 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక వీరి తర్వాత స్థానంలో బియాన్సే 237 మంది మిలియన్ల ఫాలోవర్స్‌తో దూసుకెళ్తోంది. వీరి తర్వాత స్థానంలో జస్టిన్ బీబర్‌కు 220 మంది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మోడల్ ఖోలే కార్డాషియాన్ కూడా భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఆమెకు 219 మంది మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. కాగా ఈ టాప్ 10లో ఒక్కరు కూడా మన ఇండియన్లు లేరు.
Also Read: జగన్ కోసం జనసేనను ఢీకొట్టనున్న బీజేపీ?
[…] Shreyas Iyer: ఐపీఎల్ మెగా వేలం పూర్తయింది. ఆటగాళ్ల కొనుగోలు జరిగిపోయింది. ఫ్రాంచైజీల పోటీతో ఆటగాళ్లకు నిరుటి కన్నా తక్కువ ధర రావడం తెలిసిందే. దీంతో వారి ప్రతిభ తగ్గిందా? లేక ఫ్రాంచైజీల చొరవ తక్కువయిందా? తెలియడం లేదు. మొత్తానికి ఆటగాళ్ల వేలం అంకం రేపటితో ముగియనుంది. ఇందులో హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం ఏ ఆటగాడిని కొనుగోలు చేయలేదు. దీంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ సన్ రైజర్స్ వ్యూహమేంటో అర్థం కావడం లేదు. […]