Homeక్రీడలుStar cricketer international retirement shock : అంతర్జాతీయ క్రికెట్ కు స్టార్ క్రికెటర్ రిటైర్...

Star cricketer international retirement shock : అంతర్జాతీయ క్రికెట్ కు స్టార్ క్రికెటర్ రిటైర్ మెంట్.. అంతా షాక్

Star cricketer international retirement shock : పూరన్ వెస్టిండీస్ జట్టు తరఫున విధ్వంసకరమైన ఆటగాడిగా పేరుపొందాడు. గేల్ వారసుడిగా అతడు వెస్టిండీస్ జట్టులోకి వచ్చాడు.. గేల్ అభినందనలు పొందాడు. అన్ని ఫార్మాట్లలో అదరగొట్టాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ లో బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. కౌంటి క్రికెట్ లో కూడా దుమ్ము దుమారం రేపాడు. అటువంటి పూరన్ రిటైర్మెంట్ ప్రకటించడం ఒక రకంగా సంచలనాన్ని కలిగిస్తోంది.. భయం అనేది లేకుండా.. బెదురు అనేది లేకుండా బ్యాటింగ్ చేసే ప్లేయర్లలో పూరన్ ఒకడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో చూస్తుండగానే పరుగుల వరద పారించే సత్తా అతడి సొంతం. చూస్తుండగానే మ్యాచ్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేసే ధైర్యం అతడి సొంతం. కేవలం 29 సంవత్సరాలు వయసులోనే అతడు ఈ నిర్ణయం తీసుకోవడం ఒకరకంగా షాకింగ్ లాగే ఉంది. ఇటీవల కాలంలో అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. కౌంటీ క్రికెట్లో కూడా పరుగులు బీభత్సంగా చేస్తున్నాడు. ఇక టి20 లీగ్లలో అదరగొడుతున్నాడు. అయితే అటువంటి ఆటగాడు ఒక్కసారిగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అతని అభిమానులను కూడా నిర్గాంత పోయేలా చేసింది.

పూరన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రిటర్మెంట్ కి సంబంధించిన విషయాన్ని వెల్లడించాడు..” చాలాకాలంగా క్రికెట్ ఆడుతున్నాను. వరుస అవకాశాలు దక్కించుకున్నాను. జట్టులో స్థిరమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాను. దీనంతటికీ మీరు ఇచ్చిన ప్రోత్సాహం కారణం. మేనేజ్మెంట్ అవకాశాలు ఇచ్చింది. తోటి ప్లేయర్లు సహకారం అందించారు. అభిమానులు తోడ్పాటు అందించారు. ఈ ముగ్గురి రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఈ నిర్ణయం కాస్త ఇబ్బందికరమే అయినప్పటికీ తప్పడం లేదు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను.. కష్టంగా అనిపిస్తున్నప్పటికీ ఏదో ఒక రోజు ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించక తప్పదు కాబట్టి ఈ విషయాన్ని బయటికి చెప్పక తప్పడం లేదని” నికోలస్ పూరన్ పేర్కొన్నాడు.. నికోలస్ వయసు ప్రస్తుతం 29 సంవత్సరాలు. ఇతడు 106 t20 లు ఆడాడు. 2275 రన్స్ చేశాడు. ఇక 61 వన్డేలు ఆడి 1983 పరుగులు చేశాడు. ఇందులో అతడికి మూడు శతకాలు ఉన్నాయి.. నికోలస్ నిర్ణయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. అతడి రిటైర్మెంట్ ను ఆమోదించింది.. అతడు ఇంతకాలం అందించిన సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. విండీస్ క్రికెట్ బోర్డు ఒక ట్వీట్ కూడా చేసింది.

ఇక నికోలస్ ప్రస్తుత ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. అతడు ఐపిఎల్ లో బెంగళూరు జట్టు ద్వారా ప్రవేశించాడు. హైదరాబాద్, పంజాబ్ జట్లకు ఆడాడు. ఇక ప్రస్తుత సీజన్లో లక్నో జట్టు తరఫున ఆడినప్పటికీ అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. బహుశా అతడిని వచ్చే సీజన్లో లక్నో జట్టు అంటి పెట్టుకోకపోవచ్చని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular