Caribbean Premier League 2024 : కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ లూసియా కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో తొలిసారి విజేతగా ఆవిర్భవించింది. డిపెండింగ్ ఛాంపియన్ గా కొనసాగుతున్న గయానా అమెజాన్ వారియర్స్ ను ఫైనల్ మ్యాచ్లో మట్టి కరిపించింది. 11 సంవత్సరాల కరువును జయించింది. సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్ పోరు హోరాహోరీగా జరగగా.. రోస్టన్ చేజ్ (1/13, 39*) అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. దీంతో ఆరు వికెట్ల తేడాతో సెయింట్ లూసియా విజయాన్ని దక్కించుకుంది. ట్రోఫీని సొంతం చేసుకుంది. తద్వారా కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ లూసియా తొలిసారి ఛాంపియన్ గా అవతరించింది. 11 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. తద్వారా మెగా టోర్నీలో ఛాంపియన్ గా అవతరించింది..ఫాఫ్ డూ ప్లెసిస్ ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. ఫలితంగా సెయింట్ లూసియా సీజన్ మొత్తం ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది.. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే జోరు చూపించింది. డిపెండింగ్ ఛాంపియన్ గయానా అమెజాన్ వారియర్స్ ను దారుణంగా ఓడించింది. గయానా విధించిన 139 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలో చేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ రోస్టన్ చేజ్(39*) అరోన్ జోన్స్(48*) అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు..
ముందుగా బ్యాటింగ్ చేసిన గయానా..
ప్రొవిడెన్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గయానా జట్టు 138 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ (3/19) రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. ఓపెనర్ మొయిన్ అలీ (14), హిట్ మెయిర్(11), రీఫర్(13) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 45 పరుగులకే గయానా జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోమారియో షెఫర్డ్ (19), ప్రిటోరియస్ (25) ఆదుకోవడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రోస్టన్ చేజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
డూ ప్లెసిస్ పై విమర్శలు
ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు డూ ప్లెసిస్ నాయకత్వం వహించాడు. కానీ కెప్టెన్ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. జట్టును గెలిపించలేకపోయాడు. ఫలితంగా అతనిపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈసారి అతనిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ దశలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ లూసియా ను విజేతగా నిలిపాడు. దీంతో అతనిపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ” బెంగళూరును గెలిపించలేవు.. కానీ సెయింట్ లూసియా ఛాంపియన్ గా అవతరించేలా చేశావు. నీకేమైనా న్యాయంగా ఉందా” అంటూ కన్నడ అభిమానులు అతనిపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ట్రోఫీ గెలిచిన తర్వాత డూ ప్లెసిస్ భారత కెప్టెన్ రోహిత్ శర్మను అనుకరించాడు. టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు రోహిత్ శర్మ వినూత్నంగా ట్రోఫీ అందుకున్నాడు. అదే స్టైల్ ను డూ ప్లెసిస్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రోఫీ అందుకుంటున్నప్పుడు అనుకరించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
A euphoric moment for the Saint Lucia Kings! #CPL24 #CPLFinals #SLKvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/fQZSG3C4WV
— CPL T20 (@CPL) October 7, 2024