CPL 2024 Final: కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ లూసియా కింగ్స్ విజయం..

కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024 లో సెయింట్ లూసియా కింగ్స్ ఛాంపియన్ గా నిలిచింది. సీపీఎల్-2024 ఫైనల్లో గయాన్ అమెజాన్ వారియర్ ను ఓడించి పతకం గెలుచుకుంది.

Written By: Mahi, Updated On : October 7, 2024 3:19 pm

CPL 2024 Champions

Follow us on

CPL 2024 Final: కరేబియన్ ప్రీమియర్ లీగ్ – 2024లో ‘సెయింట్ లూసియా కింగ్స్’ ఛాంపియన్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. సీపీఎల్-2024 ఫైనల్లో గయాన్ అమెజాన్ వారియర్ ను ఓడించి పతకం గెలుచుకుంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో గయానా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచింది. ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో సెయింట్ లూసియా కింగ్స్ ఈ టైటిల్ దక్కించుకుంది. సెయింట్ లూసియా కింగ్స్ తొలిసారి సీపీఎల్-2024 టైటిల్ సాధించింది. సెయింట్ లూసియా కింగ్స్ కు ఇది మూడో ఫైనల్. కాగా, సీపీఎల్ ఫైనల్ లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టుకు ఫాఫ్ డుప్లెసిస్ తొలిసారి కెప్టెన్ గా వ్యవహరించాడు. సీపీఎల్-2024 ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గయానా అమెజాన్ వారియర్స్ పై సెయింట్ లూసియా కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెయింట్ లూసియా కింగ్స్ విజయంలో అమెరికా బ్యాట్స్మన్ ఆరోన్ జోన్స్, అఫ్గానిస్థాన్ బౌలర్ నూర్ అహ్మద్ కీలక పాత్ర పోషించారు.

మొదటి సారి టైటిల్..
45 ఏళ్ల కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ కెప్టెన్సీలో గయానా అమెజాన్ వారియర్స్ గతంలో విజేతగా నిలిచి 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈసారి ఇమ్రాన్ తాహిర్ సారథ్యంలో గయానా జట్టు టైటిల్ ను సొంతం చేసుకునేందుకు బరిలోకి దిగింది. కానీ, సెయింట్ లూసియా కింగ్స్ అలా జరగనివ్వకుండా రెండు ఫైనల్స్ లో వైఫల్యాన్ని మర్చిపోయి ఈ సారి విజయానికి స్క్రిప్ట్ రాసుకున్నాడు.

20 ఓవర్లలో 138 పరుగులు..
ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. సెయింట్ లూసియా కింగ్స్ అద్భుత బౌలింగ్ తో గయానా జట్టును 150 పరుగులకే కట్టడి చేసింది. సెయింట్ లూసియా బౌలర్లలో నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సెయింట్ లూసియా బౌలర్ల ముందు గయానా బ్యాట్స్ మన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 25 పరుగులు చేసిన బ్యాట్స్ మన్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఆరోన్ జోన్స్, రోస్టన్ చేజ్ భాగస్వామ్యం సెయింట్ లూసియాను గెలిపించింది. 39 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింగ్స్ ఒకానొక దశలో ఘోరంగా విఫలమైంది. గయానా కేవలం 51 పరుగులకే సెయింట్ లూసియా 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఆరోన్ జోన్స్, రోస్టన్ చేజ్ మధ్య 50 బంతుల్లో అజేయంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫైనల్లో ఆరోన్ జోన్స్ 31 బంతుల్లో 48 పరుగులతో అజేయంగా నిలవగా, రోస్టన్ చేజ్ 22 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.