India-maldives : భారత్ తో పెట్టుకొని చేతులు కాలాక ఆకులు పట్టుకున్న మాల్దీవులు.. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?

భారత్.. ఇప్పుడు ఒక పట్లగా లేదు. ప్రపంచ జనాభాలో తొలి స్థానంలో ఉంది. నాలుగవ ఆర్థిక శక్తిగా ఎగింది. మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ విధానంలో సరికొత్త పద్ధతులను అవలంబిస్తోంది. అందువల్లే అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్ఘనిస్తాన్ వరకు భారత్ పేరు చెప్పగానే ప్రత్యేకంగా చూస్తున్నాయి. సముచిత గౌరవాన్ని అందిస్తున్నాయి.

Written By: Neelambaram, Updated On : October 7, 2024 3:10 pm

India-Maldives

Follow us on

India-maldives :  భారత్ తో కయ్యానికి కాలు దువ్విన దేశాలు పెద్దగా బాగుపడినట్లు లేదు. అంతటి చైనా కూడా గాల్వాన్ లోయ ఘటన తర్వాత సైలెంట్ అయిపోయింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ.. భారత్ అంటే భయపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాల్దీవుల దేశం భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది. అసలే పర్యాటకం మీద వచ్చే ఆదాయంతో బతికే ఆ దేశం.. చైనా అండ చూసుకొని భారత్ పై లేనిపోని విమర్శలు చేసింది. చివరికి మన సైన్యాన్ని కూడా వెనక్కి పంపించింది. దీంతో భారత్ కూడా సహాయ నిరాకరణ మొదలుపెట్టింది. ఫలితంగా మాల్దీవుల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తారు మారయింది. ఇదే విషయాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత పర్యటనలో వెల్లడించారు. మనదేశంలో నాలుగు రోజులపాటు పర్యటించడానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా కో మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ” మా దేశంలో భారతీయులు పర్యటించాలి. భారతీయులు రాకపోవడంతో అది మా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని” వ్యాఖ్యానించారు. ముయిజ్జు అధ్యక్షుడైన తర్వాత అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ప్రభుత్వంలోని మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత్ -మాల్దీవుల మధ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో భారత్ నుంచి పర్యాటకులు మాల్దీవులు వెళ్లడం తగ్గించారు..#Ban maldivelu అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఒకసారిగా మాల్దీవుల పరిస్థితి దారుణంగా మారింది. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాతో అంట కాగడం మొదలుపెట్టారు. పలు విషయాలలో చైనా సహకారం తీసుకోవడం ప్రారంభించారు. చైనా ఆర్మీ కూడా మాల్దీవుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో కొద్ది రోజులు చైనాతో ప్రయాణం చేసిన తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు కు అసలు సినిమా అర్థమైంది.. ఇప్పుడు శరణు అంటూ భారత్ సాయం కోరి వచ్చారు. నాలుగు రోజులపాటు మనదేశంలో పర్యటించనున్నారు.

వైఖరిలో మార్పు వచ్చిందా

గత ఏడాది లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులు కచ్చితంగా లక్షద్వీప్ ప్రాంతాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు. ఇది సహజంగానే మాల్దీవుల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలోని మంత్రులు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మన దేశాన్ని మురికి ప్రాంతంగా అభివర్ణించారు. దీంతో సోషల్ మీడియాలో మాల్దీవుల ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇదే క్రమంలో మాల్దీవులకు తాము వెల్లబోమని స్పష్టం చేశారు. ఫలితంగా భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆ దేశ పర్యాటక ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఇటీవల చైనా బలగాలు మాల్దీవులకు వచ్చాయి. వారు కీలకమైన సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నారని ముయిజ్జు ప్రభుత్వం ఆరోపించింది. సీక్రెట్ నిఘా ద్వారా ఆ విషయాన్ని తెలుకుంది. దీంతో అసలు విషయం అర్థమైన ముయిజ్జు ప్రభుత్వానికి.. నష్ట నివారణ చర్యలు తీసుకోవాలనే అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో భారత్ శరణు జొచ్చింది. దీని కంటే ముందు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ఆయన హాజరైనప్పుడు వైఖరిలో మార్పు వచ్చిందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే అతడు ప్రస్తుతం భారతదేశంలో నాలుగు రోజులపాటు పర్యటించనున్నాడు. ఈ క్రమంలోనే భారత్ లోని ప్రజలు తమ దేశంలో పర్యటించాలని కోరాడు. అంతేకాదు గతంలో జరిగిన వాటిని లెక్కలోకి తీసుకోవద్దని విన్నవించాడు. అందుకే చేతులు కాలకుండా చూసుకోవాలి.. కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు.. ఈ విషయం ముయిజ్జు ప్రభుత్వానికి అర్థమైంది. అందువల్లే భారత్ ప్రాపకం కోసం తాపత్రయపడుతోంది.