India vs Sri lanka: భారత్, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి ఇరు జట్లు రెడీ అయ్యాయి ప్రత్యర్థిని ఇరుకున పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. గాయాల కారణంగా జట్టుకు కొందరు దూరమైనా ఆ ప్రభావం జట్లపై పడకుండా చూసుకుంటున్నాయి. ఇదివరకే వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఇందులో కూడా రాణించి శ్రీలంకకు ధీటైన సమాధానం చెప్పాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఎవరు ఆటను ఆరంభిస్తారనే దానిపై సందిగ్దం నెలకొంది. రోహిత్ కు జతగాడిగా రుతురాజ్ గైక్వాడ్ ను ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ ను మిడిలార్డర్ లో పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియా లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసి భారీ విజయం అందుకోవాలని భావిస్తోంది.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?
ఆటగాళ్ల కూర్పుపై బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల ఎంపిక పూర్తయింది. కాకపోతే వారి వారి స్థానాలు మారుతున్నాయి. వికెట్ కీపర్ పంత్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ కీపర్ గా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా అందుబాటులోకి రావడంతో లంకను ఓడించాలని జట్టు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ కావడంతో ముగ్గురు స్పిన్నర్లతో ఇరు జట్లు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. దీంతో జడేజాతో పాటు మరో ఇద్దరు జట్టులోకి రానున్నారు. మొత్తానికి టీమిండియా విజయాల పరంపర కొనసాగించాలని భావిస్తోంది. దీని కోసమే ఆటగాళ్లను సమాయత్తం చేస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది.
Also Read: ఓట్ల కోసం ఈ నేత ఓటర్ల చెవిలో ‘బంగారు పూలు’ పెట్టిందే?