Valimai Movie Review: నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ, హుమా ఖురేషి, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప
దర్శకత్వం : హెచ్ వినోద్
నిర్మాత: బోనీ కపూర్
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటర్ : విజయ్ వేలుకుట్టి
స్టార్ హీరో అజిత్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “వలిమై”. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
Also Read: ‘భీమ్లానాయక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్
కథ:
విజయవాడలో అర్జున్ (అజిత్) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. అయితే, వైజాగ్ లో సైతాన్ అనే బ్యాచ్ డ్రగ్స్ దందా, వరుస చైన్ స్నాచింగ్ లు, హత్యలు చేస్తూ ఉంటారు. వరుస దోపిడీలు దాడులతో వైజాగ్ ప్రజలు బాధలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలో వైజాగ్ కి వస్తాడు అర్జున్. ఇంతకీ అర్జున్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు ? అసలు ఈ సైతాన్ బ్యాచ్ వెనుక ఉన్న లీడర్ ఎవరు ? ఈ బ్యాచ్ కి నరేన్ ( కార్తికేయ)కి ఉన్న సంబంధం ఏమిటి ? నరేన్ టార్గెట్ ఏమిటి ? చివరకు అర్జున్ సైతాన్ బ్యాచ్ కి ఎలా ముగింపు పలికాడు ? నరేన్ కి ఎలా బుద్ది చెప్పాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
అజిత్ మాస్ సబ్జెక్టులతో వచ్చినా ఆడియెన్స్ ను మాత్రం మెప్పించలేకపోతున్నాడు. అయితే, ఈ సినిమాతో తన అభిమనులను ఆకట్టుకున్నాడు. ఇక తన ఫ్యాన్స్ తన సినిమాల్లో ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన ఎమోషన్స్ ను కూడా యాడ్ చేసి.. అజిత్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దర్శకుడి సహజమైన టేకింగ్ బాగుంది. అజిత్ కూడా తన పాత్రలో చాలా కరెక్ట్ గా సెట్టయ్యాడు.
విలన్ గా నటించిన కార్తికేయ నటన బాగాలేదు. ఎక్స్ ప్రెషన్స్ పలకలేదు. ఇక హీరయిన్ గా నటించిన హుమా ఖురేషి కూడా తగిన ప్రాధన్యత దక్కలేదు. ఈ సినిమా నిడివి మరీ ఎక్కువుగా ఉంది. పైగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా లేదు. ఇక సాగదీత సీన్స్ కూడా బాగా విసిగించాయి. మెయిన్ గా మదర్ ట్రాక్ అస్సలు బాగాలేదు. మెలో డ్రామాతో బాగా విసిగించారు.
కాగా సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నేపథ్య సంగీతం బాగుంది. ఇక దర్శకత్వం వరకూ చాలా బాగుంది. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ కి ఈ సినిమా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్ :
అజిత్ నటన,
టేకింగ్,
విజువల్స్,
యాక్షన్ డ్రామా,
మైనస్ పాయింట్స్ :
కథాకథనాలు,
ఓవర్ బిల్డప్ డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని సెంటిమెంట్ సీన్స్,
రొటీన్ నేరేషన్,
సినిమా చూడాలా ? వద్దా ?
‘ఎమోషనల్ గా సాగే ఫుల్ యాక్షన్ డ్రామా’లను ఇష్టపడే ప్రేక్షకులు, అలాగే అజిత్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. ఇక మిగిలిన ప్రేక్షక మహాశయులు ఈ సినిమాను చూడక్కర్లేదు.
రేటింగ్ : 2.25 /5
Also Read: ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్: పవన్ కు షాక్.. టీఆర్ఎస్ సర్కార్ ప్రమోషన్ కు వాడుకుందా?