SRH Lady fan Viral Video: అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. అది స్థాయి దాటిపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ చూసేవాళ్ళు తమ అభిమాన జట్టు మీద ప్రేమను ప్రదర్శిస్తే చాలు. ఆ ప్రేమ అతిగా మారితే.. అది మరింత ఎక్కువైపోతే మొదటికే మోసం వస్తుంది. పాపం ఈ అక్క పరిస్థితి కూడా అలానే ఉంది.
ఈ అక్కకు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. పైగా ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ఆట తీరు విపరీతంగా నచ్చుతూ ఉంటుంది. అందువల్లే ఆ జట్టుకు ఈమె వీరాభిమానిగా మారిపోయింది. హైదరాబాద్ జట్టు గెలిస్తే ఎగిరి గంతులు వేయడం.. గట్టిగా నినాదాలు చేయడం ఈమె నైజం. అంతేకాదు హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ ను కూడా మైదానంలో చూస్తూ ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటుంది. కేవలం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం మాత్రమే కాదు.. ఇతర స్టేడియాలలో కూడా హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్లను ఈమె తప్పకుండా వీక్షిస్తూ ఉంటుంది. పైగా హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు భారీగా పరుగులు చేస్తే.. తానే ఆ ఘనత సాధించినట్టు చెప్పుకుంటుంది.
హైదరాబాద్ జట్టు ఈ ఐపీఎల్ లో లీగ్ దశలో సూపర్ ఆట తీరుతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మీద గెలిచినప్పుడు ఆ లేడీ ఫ్యాన్ రెచ్చిపోయింది.. ఎవరు వస్తారో రండి.. ఫిక్సింగ్ కు పాల్పడిన ముంబై వస్తుందా.. ఆర్ సి బి వస్తుందా.. చూసుకుందాం.. 2016 రిపీట్ అవుతుంది.. ఈసారి ట్రోఫీ మాదే అంటూ ధీమా వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో కలకలం రేపింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోవడంతో ఆ లేడీ ఫ్యాన్ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడు వీర లెవెల్లో రెచ్చిపోయావు కదా అక్క.. ఇప్పుడు ఎక్కడున్నావ్.
ఇప్పుడు ఏం చేస్తున్నావ్.. ఏమైపోయింది నీ ఛాలెంజ్.. ఎక్కడుంది నీ జట్టు.. అని సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఈ అక్క ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఏం చేస్తుందో తెలుసుకోవాలి. తన జట్టు ఓడిపోవడంతో నిర్వేదంలో ఉందా.. బాధలో ఉందా.. సోషల్ మీడియాలో కనిపించడం లేదు.. ఒక వీడియో ఈమె చేస్తే బాగుండు. తమ జట్టుకు అంత సీన్ లేదని.. 2016 నాటి సీన్ రిపీట్ కాదని చెబితే బాగుండు. అభిమానం అంటే గొప్పగా ఉండాలి. ఇలా విమర్శించేలా ఉండకూడదని.. సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.
View this post on Instagram
