Travis Head Batting
SRH vs RR : గత ఐపీఎల్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తో జరిగిన మ్యాచ్లో శివతాండవం చేశాడు. ఏకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోరు ను 287/3 వద్ద నిలిపాడు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals) జట్టుతో జరిగిన మ్యాచ్ లో 31 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 67 పరుగులు చేశాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jora Archer) బౌలింగ్లో హెడ్ కొట్టిన భారీ సిక్సర్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. అతడు కొట్టిన బంతి డీప్ మిడ్ వికెట్ మీదుగా 105 మీటర్ల దూరం వెళ్ళింది. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా 11 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టి 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్(Ishan kishan) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 106* పరుగులు చేశాడు.
Also Read : ఇదేం బ్యాటింగ్ భయ్యా.. హెడ్ కంటే ఇషాన్ కిషన్ మోస్ట్ డేంజర్..
పాపం ఆర్చర్..
ఇక ఈ మ్యాచ్ లో ఆర్చర్ దారుణంగా బౌలింగ్ వేశాడు. అతని బౌలింగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నాలుగు ఓవర్లు వేసిన ఆర్చర్ 76 పరుగులు సమర్పించుకోవడం విశేషం. ఇక ఇతర బౌలర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. పజిల్ ఫారుకి, మహేష్ తిక్షణ వంటి వారు కూడా చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు.. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సంజు శాంసన్(66), ధృవ్ జూరెల్(70), హిట్ మేయర్ (42), శుభం దుబే(34) పరుగులు చేసినప్పటికీ రాజస్థాన్ జట్టు విజయం సాధించలేకపోయింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్, సమర్ జీత్ సింగ్ చెరి రెండు వికెట్లు సాధించారు. మహమ్మద్ షమీ, అడం జంపా చెరి ఒక వికెట్ పడగొట్టారు. ప్లాట్ మైదానం కావడంతో ఉప్పల్ స్టేడియంలో భారీ స్కోరులు నమోదు అయ్యాయి. సాధారణంగా ఇలాంటి మైదానంపై బౌలర్లకు బౌలింగ్ వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆదివారం నాటి మ్యాచ్లో ఇదే దృశ్యం కనిపించింది. అటు హైదరాబాద్, ఇటు రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడం..పిచ్ ఏర్పాటుచేసిన తీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
Also Read : సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది.. ముంబై వద్దనుకుంది..సీన్ కట్ చేస్తే “ఇషాన్” దార్ సెంచరీ చేశాడు..