Ishan Kishan
Ishan Kishan: భయంకరంగా బ్యాటింగ్ చేసిన హెడ్ 67 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ 24 పరుగుల వద్ద వెనుతిరిగాడు. తుఫాన్ స్థాయిలో బ్యాటింగ్ చేసిన క్లాసెన్ 34 పరుగులకే అవుట్ అయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులకే చేతులెత్తేశాడు.
ఇలాంటి స్థితిలో వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన ఇషాన్ కిషన్ (106* 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు) చివరిదాకా నిలబడ్డాడు. హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, ఇలా అందరి ఆటగాళ్లతో మెరుగైన భాగస్వామ్యాను నెలకొల్పాడు. తద్వారా హైదరాబాద్ జట్టు స్కోరును 286 పరుగుల వద్ద వరకు తీసుకెళ్లాడు.. మధ్యలో హైదరాబాద్ జట్టు అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్ వికెట్లు కనుక కోల్పోకపోతే 300 స్కోర్ ఖచ్చితంగా చేసేది. వారి వికెట్లు పోవడం.. వారి కంటే ముందు క్లాసెన్ అవుట్ కావడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. అయినప్పటికీ ఇషాన్ కిషన్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేసి.. ఐపీఎల్ 18వ ఎడిషన్ లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.. అద్భుతమైన బ్యాటింగ్.. అనితర సాధ్యమైన టెక్నిక్ తో ఇషాన్ కిషన్ పరుగుల వరద పారించాడు.
ఆ కసి అతడిలో పట్టుదల పెంచింది
ఇషాన్ కిషన్ లో కసి పట్టుదల పెంచింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బీసీసీఐ పెద్దలు అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. రెండవది గత ఏడాది జరిగిన మెగా వేలంలో ముంబై జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. ఇవి రెండు ఇషాన్ కిషన్ మీద తీవ్రంగా ప్రభావం చూపించాయి. అందువల్లే అతడు కసి కొద్ది ఆడాడు. అకుంఠిత దీక్షతో.. విపరీతమైన పట్టుదలతో తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. ఎవరైతే తనను వద్దనుకున్నారో.. ఎవరైతే తనను విమర్శించారో.. ఎవరైతే తనను బయటకు పంపించారో.. వారందరికీ సరైన సమాధానం చెప్పే విధంగా బ్యాటింగ్ చేశాడు. హెడ్ మధ్యలో అవుట్ అయినప్పటికీ.. అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఏ మాత్రం సహనాన్ని కోల్పోక.. అనవసరమైన షాట్లు ఆడక.. ఇషాన్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు ఐపీఎల్లో తొలి సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ ఇప్పటివరకు 105 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 2700+ పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 137. ఇప్పటివరకు 17 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు.
పోయిన చోటే వెతుక్కున్నాడు
అద్భుతమైన బ్యాటింగ్ తో కిషన్ పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నం మొదలు పెట్టాడు. బిసిసిఐ ఏ కారణంతో తనను సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తొలగించిందో.. ఏ కారణంతో ముంబై జట్టు యాజమాన్యం తనను వద్దనుకుందో.. వారందరికీ తన బ్యాటింగ్ తోనే కిషన్ సమాధానం చెప్పాడు. బహుశా ఇది శాంపిల్ మాత్రమేనని.. అసలు సినిమా మునుముందు చూపిస్తానని ఇషాన్ కిషన్ తన బ్యాట్ ద్వారా సంకేతాలు ఇవ్వడం విశేషం.
A special first for Ishan Kishan as he brought up his off just 45 balls
Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/8n92H58XbK
— IndianPremierLeague (@IPL) March 23, 2025