Manchu Vishnu
Manchu Vishnu : సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్ లో ఉండే పేర్లలో ఒకటి మంచు విష్ణు(Manchu Vishnu). ఎదో ఒక అంశంలో విష్ణు ట్రెండ్ అవుతూనే ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. పాజిటివ్ కంటే ఎక్కువగా నెగిటివ్ గానే ఆయన ట్రెండ్ అవుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు యూత్ ఆడియన్స్ కి ఒక్కోసారి చాలా కామెడీ గా అనిపిస్తూ ఉంటుంది. ఈయన కెరీర్ లో మంచి హిట్స్ అయితే ఉన్నాయి, కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. విలన్ గా, హీరో గా మోహన్ బాబు(Manchu Mohan Babu) మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అనితర సాధ్యమైనది. ముఖ్యంగా ఒక విలన్ గా జనాల్లో ముద్ర వేసుకున్న తర్వాత హీరో గా సక్సెస్ అయ్యి, సూపర్ స్టార్ స్టేటస్ ని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. చిరంజీవి, రజినీకాంత్ వంటి వారు కూడా విలన్స్ గా నటించి ఆ తర్వాత హీరోలు అయినవారే. కానీ మోహన్ బాబు రూట్ వేరు. ఆయన రావు గోపాల రావు, కైకాల సత్యనారాయణ తరహా రెగ్యులర్ విలన్.
Also Read : కెమెరా మ్యాన్ పై మనసు పారేసుకున్న హీరోయిన్ రష్మిక..వీడియో వైరల్!
అలాంటి వ్యక్తి హీరో గా మారి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ని ఇచ్చి, సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇలా భారతదేశంలో మోహన్ బాబు కి తప్ప ఎవరికీ జరగలేదు. అలాంటి మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చి, ఆయన స్థాయికి చేరుకోలేకపోయారు అనే వెలతి మోహన్ బాబు లో ఇప్పటికీ ఉంది. ఆ వెలతి ని ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం తీరుస్తుందని అటు మోహన్ బాబు, ఇటు మంచు విష్ణు చాలా బలమైన నమ్మకం తో ఉన్నాడు. సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం, వచ్చే నెల 25 న అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ఇప్పటి నుండే ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన తన పిల్లల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళతో ఉన్నంతసేపు నేను ఈ లోకాన్నే మర్చిపోతుంటాను. నా భారీ విరానిక ని ఇంకా పిల్లలు కావాలని అడిగాను, అప్పుడు ఆమె నాకు ఓపిక లేదు, వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పింది’ అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన పిల్లలు కూడా కన్నప్ప చిత్రం లో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : నాగ చైతన్య నుండి 200 కోట్ల ఆఫర్..రిజెక్ట్ చేసిన సమంత!