SRH VS RR Match
SRH vs RR : ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు అత్యంత విజయవంతమైన టీం కాకపోయినప్పటికీ.. బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న జట్టు అది. ఆ జట్టు హైదరాబాదులో మ్యాచ్ ఆడినా.. జైపూర్ లో మ్యాచ్ ఆడినా బలమైన ఆరెంజ్ ఆర్మీ వెంట వస్తుంది..సన్ రైజర్స్ హైదరాబాద్ జెండాలతో ఆకట్టుకుంటుంది. టీ షర్టులు, క్యాపులు ధరించి సపోర్ట్ చేస్తుంది. అందువల్లే సోషల్ మీడియాలో ఆరెంజ్ ఆర్మీ కి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఆరెంజ్ ఆర్మీ ని సంతృప్తిపరిచే విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీతులలో పబ్లిసిటీ చేస్తుంది. తాజాగా హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ రూపొందించిన ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. దానికి RRR సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడంతో దద్దరిల్లిపోతుంది.
Also Read : హెడ్ కు తిక్క రేగితే బంతి గాల్లోనే తేలుతుంది..
దానికి తగ్గట్టుగానే
ఈసారి హైదరాబాద్ జట్టు play with fire అనే ట్యాగ్ లైన్ ను వాడుకులోకి తెచ్చింది. దానికి తగ్గట్టుగానే ఒక అద్భుతమైన వీడియోను రూపొందించింది.. అందులో RRR సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. పాత్రలు పరిచయం చేసే డైలాగులను తనకు అనుకూలంగా మార్చుకుంది. ” వాళ్లు పవర్ ప్లే లో కనబడితే నిప్పుకను నిలబడినట్టు ఉంటది. గూగుల్ ఇస్ అయినా యార్కర్స్ అయినా వాళ్లకు బాంచన్ అయితది” అని అంటూ రూపొందించిన వీడియో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులను ఆకట్టుకుంటున్నది.. ఆ వీడియోకు తగ్గట్టుగానే ఆదివారం ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై హైదరాబాద్ ఆటగాళ్లు ఆడారు. ముందుగా బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్ల పాటు ఆడి.. 286 పరుగులు చేశారు. ఇందులో ఇషాన్ కిషన్ ఏకంగా సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 242 పరుగుల వద్ద ఆగిపోయింది. తద్వారా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల బ్యాటింగ్ play with fire అనే ట్యాగ్ లైన్ కు అచ్చు గుద్దినట్టు సరిపోయింది. అంతేకాదు ఆటగాళ్లు మైదానంలో ఫైర్ మాదిరిగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేశారు.. మొత్తంగా ఆరెంజ్ ఆర్మీ పరుగుల దాహాన్ని తీర్చారు. ఐపీఎల్ 18 ఎడిషన్ లో మొదటి అడుగును అత్యంత బలంగా వేశారు. తదుపరి మ్యాచ్లో కూడా హైదరాబాద్ ఇలాగే జోరు సాగిస్తే.. 18వ ఎడిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును విజేత కాకుండా ఎవరూ ఆపలేరని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఒరేయ్ బాబూ.. నీ అభిమానం తగలెయ్య.. క్రికెటర్లు కూడా మనుషులే..