Summer Car Tips
Summer Car Tips : గతంతో పోల్చుకుంటే దేశంలోని అనేక ప్రాంతాల్లో వేడి తీవ్రం అయింది. ముఖ్యంగా మైదాన ప్రాంతాలలో పగటిపూట వేడి పెరిగిపోయింది. ఉదయం 9గంటలకే సూర్యుడు మండిపడుతున్నాడు. దీంతో జనాలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వేసవిలో మీ చర్మాన్ని వేడి నుంచి రక్షించడానికి, పొడిబారకుండా నిరోధించడానికి పలు రకాల మాశ్చరైజర్లను ఉపయోగిస్తుంటారు. తద్వారా సూర్యకాంతి మీ చర్మాన్ని ప్రభావితం చేయదు. మరి కారు కూడా అలాగే ఉంటుంది.మండుతున్న సూర్యకాంతి కారు బాడి మీద పడినప్పుడు దాని పెయింట్ దెబ్బతింటుంది. మీ కారు పెయింట్‌ను మంచిగా ఉంచుకునేందుకు కొన్ని టిప్స్ పాటించండి.
Also Read : ఫస్ట్ టైం ట్యాక్సీ కోసం కేవలం రూ.6.79లక్షలకే మారుతి నయా మోడల్
వేసవి కాలంలో సూర్యుడి వేడి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. సూర్యకిరణాలు నేరుగా కారుపై పడితే అది కారు బాడీ పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే UV కాంతి కారణంగా కారు కలర్ మసకబారుతుంది. కాబట్టి, కారును ఎండ నుంచి రక్షించడానికి, దానిని నీడలో పార్క్ చేయండి. మీకు పార్క్ చేయడానికి స్థలం లేకపోతే చెట్టు నీడలో కారును పార్క్ చేయడానికి ప్రయత్నించండి. కారుపై సూర్యకాంతి ఎంత తక్కువగా పడితే కారు అంత సురక్షితంగా ఉంటుంది.
UV ప్రొటెక్ట్ కవర్ ఉపయోగించండి
ఇది కాకుండా మీరు కారును బయట పార్క్ చేయాల్సి వస్తే, UV ప్రొటెక్టివ్ కవర్ ఉపయోగించండి. UV ప్రొటెక్టివ్ కవర్ అనేది ప్రాథమికంగా కారుపై కప్పినప్పుడు హానికరమైన కాంతి కారును నేరుగా పడకుండా నిరోధిస్తుంది. పార్కింగ్ సౌకర్యం లేనప్పుడు ఈ కవర్ కారు పెయింట్‌ను రక్షిస్తుంది.
UV రెసిస్టెంట్ కారు
కారును పార్కింగ్ చేసేటప్పుడు, దానిని నీడలో ఉంచడం, ఎండ నుంచి రక్షించడానికి దానిని పార్క్ చేయడం ఒక పరిష్కారం. కానీ మీరు కోరుకుంటే కారుకు సూర్యకాంతి వల్ల ఎటువంటి సమస్య రాకూడదు. దీని కోసం కారు కొనేటప్పుడు, UV రెసిస్టెంట్ కారును సెలక్ట్ చేసుకోండి. అంటే, ఆ కార్లపై హానికరమైన లైట్ల ప్రభావాన్ని తగ్గించాలి. దీనితో పాటు మీరు కారును పెయింట్ చేయించేటప్పుడు UV రెసిస్టెంట్ వేయించేందుకు ప్రయత్నించండి.
Also Read: ఇలా కొంటే టాటా పంచ్ మీద రూ.1.71లక్షలు ఆదా