SRH Vs RR (2)
SRH Vs RR: ఐపీఎల్ లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ మైదానం(Hyderabad Uppal cricket stadium)లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) మధ్య మ్యాచ్ మొదలైంది. హైదరాబాద్ జట్టు టాస్ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఉప్పల్ మైదానంలో మ్యాచ్ కావడంతో ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. ఉప్పల్ మైదానం సిట్టింగ్ సామర్థ్యం 55,000 కాగా.. అన్ని టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. అయితే కొంతమంది బ్లాక్లో టిక్కెట్లు విక్రయిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మ్యాచ్ నేపథ్యంలో మైదానంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను, వాటర్ బాటిళ్లను తీసుకు వెళ్ళనివ్వడం లేదు.. హైదరాబాదులో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. స్టేడియంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి తెలంగాణ పోలీస్ శాఖ(Telangana police department) ఏకంగా 2,700 మంది ఖాకీ లను విధుల్లో నియమించింది. వారంతా కూడా భద్రతను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం మొదలుపెట్టారు. ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో(Hyderabad metro railway) కూడా ప్రత్యేకంగా రైళ్లు నడుపుతోంది.
Also Read: ఐపీఎల్ లో ఓల్డెస్ట్, యంగెస్ట్ ప్లేయర్లు వీరే..
తాటతీస్తారు
ఐపీఎల్ మ్యాచ్ అంటే యువతీ యువకులు హాజరవుతుంటారు. పైగా హైదరాబాదులో ఉప్పల్ నడిబొడ్డున స్టేడియం ఉండడంతో ప్రేక్షకుల తాకిడి అధికంగా ఉంటుంది. హైదరాబాద్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచగా.. హాట్ కేకుల్లాగా అమ్ముడు పోయాయి. ప్రేక్షకులు పోటీపడి టికెట్లు కొనుగోలు చేశారు. ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే మైదానంలోకి యువతులు కూడా వస్తుంటారు కాబట్టి.. వారిని కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. వారిని కామెంట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారు. గతంలో ఈ తరహా సంఘటనలు జరిగిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈసారి అలర్ట్ అయ్యారు. షీ టీమ్స్(Telangana police she teams) ను మైదానంలో మహిళల రక్షణను పర్యవేక్షించేందుకు నియమించారు. షీ టీమ్స్ లోని పోలీసులు మఫ్టీలో ఉంటూ మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆకతాయిలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే తాటతీస్తారు. ఇక ఇప్పటికే మైదానంలోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను(water bottles electronic goods) నిషేధించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కడిపడితే.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పోలీసులు మరో మాటకు తావులేకుండా అదుపులోకి తీసుకుంటారు. మరోవైపు స్టేడియంలో ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 2,700 మంది పోలీసులు స్టేడియంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.. అభిమానులు రెచ్చిపోకుండా.. సరదాగా మ్యాచ్ చూసే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. నిన్న కోల్ కతా లో బెంగళూరు(Royal challengers Bangalore), కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata knight riders) జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని చూసేందుకు ఓ అభిమాని సెక్యూరిటీని సైతం చేదించుకొని మైదానంలోకి అడుగు పెట్టాడు. ఆ ఘటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం(Hyderabad Uppal cricket stadium)లో కట్టదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు లోపలికి రాకుండా ఎక్కడికి అక్కడ సెక్యూరిటీని పటిష్టం చేశారు.