https://oktelugu.com/

IPL 2025: ఐపీఎల్ లో ఓల్డెస్ట్, యంగెస్ట్ ప్లేయర్లు వీరే..

IPL 2025 ఐపీఎల్ అనగానే ఆకాశమే హద్దులాంటి క్రికెట్ గుర్తుకు వస్తుంది. దూకుడుకు పర్యాయపదం లాంటి ఆటతీరు కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే ఐపీఎల్లో కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే సత్తా చాటతారంటే అపోహ మాత్రమే.

Written By: , Updated On : March 23, 2025 / 01:51 PM IST
IPL 2025 (11)

IPL 2025 (11)

Follow us on

IPL 2025: మొత్తానికి ఐపీఎల్ 18వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ (Kolkata Eden gardens) వేదికగా జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) తొలి మ్యాచ్లో తలపడ్డాయి.. అయితే ఈసారి బెంగళూరు అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి కోల్ కతా పై ఏడు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.

Also Read: కొదమసింహాల మధ్య పోటీనేడు.. ఎవరు గెలిచినా సంచలనమే..

ఐపీఎల్ అనగానే ఆకాశమే హద్దులాంటి క్రికెట్ గుర్తుకు వస్తుంది. దూకుడుకు పర్యాయపదం లాంటి ఆటతీరు కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే ఐపీఎల్లో కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే సత్తా చాటతారంటే అపోహ మాత్రమే. ఎంత టి20 లీగ్ అయినప్పటికీ.. సీనియర్ ఆటగాళ్ల అనుభవం లేకపోతే.. ఈ పొట్టి ఫార్మాట్ కు అర్థమే లేదు. అందువల్లే అన్ని జట్లు సీనియర్.. జూనియర్ ఆటగాళ్లతో కళకళలాడుతున్నాయి. ఐపీఎల్ లో ఉన్న 10 జట్లలో మోస్ట్ సీనియర్.. మోస్ట్ జూనియర్ ఆటగాళ్లు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

కోల్ కతా నైట్ రైడర్స్

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో అత్యంత చిన్న వయసు ఉన్న ఆటగాడిగా రఘువంషి కొనసాగుతున్నాడు. ఇతడి వయసు 19 సంవత్సరాలు. అత్యంత ఎక్కువ వయసు ఉన్న ఆటగాడిగా మోయిన్ అలీ కొనసాగుతున్నాడు. ఇతడి వయసు 35 సంవత్సరాలు.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లో ముషీర్ ఖాన్ అత్యంత చిన్న వయసు ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇతడి వయసు 20 సంవత్సరాలు. గ్లెన్ మాక్స్ వెల్ అత్యధిక వయసున్న ఆటగాడిగా ఉన్నాడు. ఇంటర్ వయసు 36 సంవత్సరాలు.

లక్నో సూపర్ జెయింట్స్

లక్నో జట్టులో అతి చిన్న వయసున్న ఆటగాడిగా అర్ష్ ణి కులకర్ణి కొనసాగుతున్నాడు. ఇతడి వయసు 20 సంవత్సరాలు. డేవిడ్ మిల్లర్ అత్యధిక వయసున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇతడి వయసు 35 సంవత్సరాలు.

గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ జట్టులో కుమార్ కుషాగ్ర అత్యంత చిన్న వయసున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇతడి వయసు 20 సంవత్సరాలు. ఇక అత్యంత ఎకోవేషణ ఆటగాడిగా ఈశాంత్ శర్మ కొనసాగుతున్నాడు. ఇతడి వయసు 36 సంవత్సరాలు.

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో విప్రాజ్ నిగం 20 సంవత్సరాల వయసుతో అత్యంత చిన్న వయసున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఫాప్ డూ ప్లేసిస్ 40 సంవత్సరాల వయసుతో అత్యంత ఎక్కువ ఏజ్ ఉన్న ఆటగాడిగా ఉన్నాడు.

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ జట్టులో 13 సంవత్సరాల వయస్సుతో వైభవ్ సూర్యవంశీ అత్యంత చిన్న వయసు ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 31 సంవత్సరాల వయసుతో సందీప్ శర్మ అత్యంత ఎక్కువ ఏజ్ ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో 21 సంవత్సరాల వయసుతో నితీష్ కుమార్ రెడ్డి అత్యంత పిన్న వయస్కుడిగా కొనసాగుతున్నాడు. 36 సంవత్సరాల వయసుతో సచిన్ బేబీ అత్యంత ఎక్కువ ఏజ్ ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ముంబై ఇండియన్స్

ముంబై జట్టులో అల్లా గజన్ పార్ 18 సంవత్సరాల వయసుతో అత్యంత చిన్న వయస్కుడిగా కొనసాగుతున్నాడు. 37 సంవత్సరాల వయసుతో రోహిత్ శర్మ అత్యంత ఎక్కువ ఏజ్ ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్వస్తిక్ చిక్కారా 19 సంవత్సరాల వయసుతో అత్యంత తక్కువ ఏజ్ ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 36 సంవత్సరాల వయసుతో అత్యంత ఎక్కువ ఏజ్ ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 18 సంవత్సరాల వయసుతో అత్యంత చిన్న ఏజ్ ఉన్న ఆటగాడిగా ఆండ్రి సిద్ధార్థ కొనసాగుతున్నాడు. 43 సంవత్సరాల వయసుతో ఎంఎస్ ధోని అత్యంత ఎక్కువ వయసున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు.