Peddi movie latest update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ప్రేక్షకుల్లో , అభిమానుల్లో, ట్రేడ్ లో ఉన్నటువంటి అంచనాలు సాధారణమైనవి కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి.. చికిరి’, ‘రయ్ రయ్ రారా’ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెల 27 న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో , ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ రాబోతోందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అదేంటో చూద్దాం.
‘పెద్ది’ చిత్రం కేవలం సినిమా స్కోప్ లో మాత్రమే కాదు, ఐమాక్స్, డాళ్బీ వెర్షన్ లో కూడా విడుదల కాబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. గతం లో #RRR మాత్రమే డాళ్బీ విజన్ వెర్షన్ లో విడుదలైంది, ఆ తర్వాత ఇప్పుడు పెద్ది చిత్రం ఆ వెర్షన్ లో విడుదల కాబోతుంది. మన సౌత్ ఇండియా లో డాళ్బీ స్క్రీన్స్ కేవలం రెండే ఉన్నాయి. ఒకటి బెంగళూరు లో AMB సినిమాస్ కాగా, మరొకటి త్వరలోనే హైదరాబాద్ లోని ‘కోకాపేట’ లో మొదలు కాబోతున్న ‘అల్లు సినిమాస్’. ఈ రెండు తప్ప , సౌత్ లో మరో డాళ్బీ స్క్రీన్ లేదు. కానీ నార్త్ ఇండియా లో మాత్రం డాళ్బీ స్క్రీన్స్ కి కొదవే లేదు. ఇక ఓవర్సీస్ లోన్ అయితే ‘డాళ్బీ’ సినిమాస్ అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఇది ‘పెద్ది’ చిత్రానికి భారీ అడ్వాంటేజ్ కాబోతుంది. ఓవర్సీస్ బయ్యర్స్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే, ఈ చిత్రం కేవలం నార్త్ అమెరికా లోనే ప్రీమియర్ షోస్ నుండి 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే నేడు విడుదల చేసిన పోస్టర్ కి కూడా ఫ్యాన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 30 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని విధాలుగా కష్టపడుతున్నారు మేకర్స్. ఇక కేవలం వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమానరంగా జరుగుతోంది. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు అయినటువంటి మార్చి 27 న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు అనే రూమర్ ఉంది. కానీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఒత్తిడి మీద జరుగుతోంది. ఇలాంటి సమయం లో టీజర్ ని విడుదల చేసేంత సమయం మేకర్స్ కి ఉంటుందా లేదా అనేది చూడాలి.