America (2)
America: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ కామన్ అయింది. ఇబ్బడిముబ్బడిగా లైసెన్స్ ఇస్తుండడం, డ్రగ్స్, జాత్యహంకారం, దోపిడీ ఇలా అనేక కారణాలతో కాల్పులు జరుగుతున్నాయి. అయితే ఇటీవల వరుస ఘటనల్లో భారతీయులే(Indians) మృతిచెందడమే ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అమెరికాలో జరిగిన ఒక దుర్ఘటనలో భారత మూలానికి చెందిన తండ్రి మరియు కూతురు కాల్పుల్లో మరణించారు. ఈ ఘటన మార్చి 20న ఉదయం 5:30 గంటల సమయంలో వర్జీనియా(Varjeenia) రాష్ట్రంలోని అక్కోమాక్ కౌంటీలో లాంక్‌ఫోర్డ్ హైవేపై ఉన్న ఒక కన్వీనియన్స్ స్టోర్‌లో చోటు చేసుకుంది. మరణించిన వారు ప్రదీప్‌కుమార్ పటేల్ (56), అతని కూతురు ఊర్మి పటేల్ (24)గా గుర్తించారు. వీరు గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందినవారు. ఆరేళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు. ఈ ఘటనలో జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్(44) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Also Read: కుప్పకూలిన 120 అడుగుల రథం.. ఏం జరిగిందంటే..!
మద్యం కోసం వచ్చి…
జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ ఉదయం స్టోర్ వద్దకు మద్యం కొనుగోలు చేయడానికి వచ్చి, స్టోర్ రాత్రి ఎందుకు మూసివేశారని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా సిబ్బందితో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ ఇష్టానుసారంగా కాల్పులు జరిపాడు. ప్రదీప్ పటేల్(Pradeep patel) అక్కడికక్కడే మరణించగా, ఊర్మి(Urmi)ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె గాయాలతో మరణించింది. ఈ స్టోర్ వారి బంధువైన పరేష్ పటేల్‌ది. అక్కడ వారు పని చేస్తున్నారు. ఈ దాడి భారతీయుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా వార్తలు వేగంగా వ్యాపించాయి. ప్రదీప్ బంధువులు మెహసానాలో ఈ ఘటనను ధ్రువీకరించారు. కాల్పులకు ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు.
అమెరికాలో కాల్పుల ఘటనలు..
అమెరికాలో కాల్పులు, తుపాకీ సంబంధిత హింస గురించిన గణాంకాలు దేశంలోని ఒక ప్రధాన సమస్యను ప్రతిబింబిస్తాయి. క్రింద 2023, ఇతర సంవత్సరాల నుండి సేకరించిన తాజా డేటా ఆధారంగా కొన్ని ముఖ్యమైన గణాంకాలు..
మొత్తం తుపాకీ మరణాలు:
2023లో అమెరికాలో 46,728 మంది తుపాకీ హింస వల్ల మరణించారు, ఇది రికార్డులో మూడవ అత్యధిక సంఖ్యగా నమోదైంది. ఇది 2022తో పోలిస్తే 3% తగ్గుదలను సూచిస్తుంది, అయినప్పటికీ సంఖ్య ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది.
తుపాకీ ఆత్మహత్యలు..
2023లో 27,300 మంది తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నారు, ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక సంఖ్య. 2019 నుండి తుపాకీ ఆత్మహత్యల రేటు 12% పెరిగింది.
తుపాకీ హత్యలు:
2023లో 17,951 మంది తుపాకీ హత్యల్లో మరణించారు, ఇది 2022తో పోలిస్తే 8.6% తగ్గుదల (1,724 తక్కువ హత్యలు). అయినప్పటికీ, ఇది రెండవ అత్యధిక సంఖ్యగా ఉంది.
పిల్లలు, యువకులపై ప్రభావం:
2023లో 1–17 సంవత్సరాల వయస్సు గల 2,566 మంది పిల్లలు మరియు యువకులు తుపాకీ హింసలో మరణించారు, ఇది రోజుకు సగటున 7 మరణాలుగా ఉంది. తుపాకీలు వారికి నాలుగు సంవత్సరాలుగా ప్రధాన మరణ కారణంగా ఉన్నాయి.
రోజువారీ గణాంకాలు:
ప్రతి రోజు సగటున 128 మంది తుపాకీ హింసలో మరణిస్తారు, అంటే ప్రతి 11 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుంది. అదనంగా, రోజుకు 200 మందికి పైగా తుపాకీ గాయాలతో ఆసుపత్రులకు వస్తారు.