https://oktelugu.com/

IPL 2025: తొలి మ్యాచ్‌కు ముందు రోహత్‌శర్మ కీలక నిర్ణయం.. ఏం చేశాడంటే..!

IPL 2025 : ఐసీఎల్‌(IPL)లో అత్యధికసార్లు ట్రఫీ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. తర్వాత దీనిని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సమం చేసింది. సీజన్‌ 18లో మరోమారు పైచేయి సాధించాలని ముంబై ఇండియా ఉత్సాహంతో బరిలో దిగబోతోంది. తొలి మ్యాచ్‌ ఆదివాంర(మార్చి 23న) జరగనుంది.

Written By: , Updated On : March 23, 2025 / 03:51 PM IST
Rohith Sharma

Rohith Sharma

Follow us on

IPL 2025 : భారత క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ IPL 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నారు. కుటుంబ ప్రేమకు పేరుగాంచిన రోహిత్, తాజాగా తన గ్లోవ్స్‌పై ‘SAR’ అనే అక్షరాలతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఈ ‘SAR’ను అతని భార్య రితికా, కుమార్తె సమైరా, కుమారుడు అహాన్‌లను సూచిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్‌ షేర్‌ చేసిన వీడియోలో ఈ గ్లోవ్స్‌(Glouse) స్పష్టంగా కనిపించాయి. రోహిత్‌ ఇటీవల ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy)లో భారత జట్టును విజయతీరాలకు చేర్చి, అన్ని ఐఇఇ ఈవెంట్‌లలో ఫైనల్స్‌కు నడిపించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచ కప్, ౖఈఐ ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్‌ ట్రోఫీలలో భారత్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఘనత ఆయనది. ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబంతో గడిపే క్షణాలను పంచుకుంటూ, తన వ్యక్తిగత జీవితంలోని సన్నిహితత్వాన్ని చాటుకుంటారు.

Also Read : ఉప్పల్ లో IPL మ్యాచ్.. జాగ్రత్తగా లేకుంటే తాటతీస్తారు బ్రదర్స్..

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు..
ఐ్కఔ 2025 ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రుతురాజ్‌ గైక్వాడ్‌ నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మార్చి 23, ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకోనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియా(Australia) మాజీ క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్(Arone Finch), ‘రోహిత్‌ ఆటతీరు అద్భుతం. జట్టు గతిశీలతను అర్థం చేసుకుని, ప్రారంభం నుంచే ఆధిపత్యం చెలాయించడం అతని ప్రత్యేకత‘ అని ప్రశంసించారు. అయితే, ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో సవాలు లేకపోలేదు. కీలక ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయం నుంచి కోలుకుంటుండటంతో ఈ మ్యాచ్‌లో ఆడటం అనుమానమే. రోహిత్‌ నాయకత్వంలో జట్టు ఈ లోటును ఎలా భర్తీ చేస్తుందనేది ఆసక్తికరం. టీ20 కెరీర్‌ చివరి దశలో ఉన్న రోహిత్, మరింత దూకుడుగా ఆడుతూ సిక్సర్ల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

‘ అఖ’ గ్లోవ్స్‌తో కుటుంబానికి నివాళులర్పిస్తూ, రోహిత్‌ శర్మ ఐ్కఔ 2025లో ముంబై ఇండియన్స్‌ను మరోసారి విజయపథంలో నడిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అభిమానులు ఈ సీజన్‌లో ఆయన నుంచి అద్భుత ప్రదర్శనలు ఆశిస్తున్నారు.

Also Read : కొదమసింహాల మధ్య పోటీనేడు.. ఎవరు గెలిచినా సంచలనమే..