SRH Vs MI 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ గా సాగుతోంది. వరుస విజయాలతో చెన్నై మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే హైదరాబాద్ జట్టు ప్రారంభ మ్యాచ్ లో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ లో విజయం సాధించాలని హైదరాబాద్ భావిస్తోంది. కమిన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు మైదానంలో కసరత్తు చేస్తోంది. అయితే ముంబై జట్టుతో మ్యాచ్ కు ముందు హైదరాబాద్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
హైదరాబాద్ జట్టుకు చెందిన హసరంగ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ మాత్రమే కాదు అతడు కొంతకాలం వరకు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గాయం తగ్గేవరకు అతడు హైదరాబాద్ జట్టుకు దూరమవుతాడు. హసరంగ ఈమధ్య బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో అదరగొట్టాడు. వన్డే, టి20 మ్యాచ్ లలో 8 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ అనంతరం అతడు ఎడమ కాలికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. ఫలితంగా శ్రీలంక క్రికెట్ వైద్య బృందం అతడికి వైద్య చికిత్సలు చేసింది. కొంతకాలం పాటు ఆటకు దూరం కావాలని వైద్య బృందం సూచనలు చేసినట్టు ఇంగ్లీష్ మీడియా ప్రకటించింది. ఫలితంగా హైదరాబాద్ క్యాంపులో హసరంగ ఇప్పట్లో చేరే అవకాశాలు లేవని తెలుస్తోంది.
2022లో హసరంగ బెంగళూరు జట్టులో ఆడాడు. అప్పట్లో 7.54 ఎకానమీతో 26 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేశాడు. ఇక గత ఏడాది చివరిలో ఐపీఎల్ మినీ వేలంలో హైదరాబాద్ జట్టు అతడిని 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో మెరుపులు మెరిపిస్తాడని భావించింది. కానీ, కీలక మ్యాచ్ కు ముందు అతడు గాయపడటంతో హైదరాబాద్ జట్టులో ఆందోళన నెలకొంది.
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. కోల్ కతా వేదికగా కోల్ కతా లోఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. తదుపరి మ్యాచ్ సొంత మైదానం ఉప్పల్ లో ముంబై జట్టుతో తలపడనుంది. ఇక ముంబై జట్టు తన తొలి మ్యాచ్ చెన్నై తో ఆడింది. చివరి వరకు ఆడి ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో అటు చెన్నై, ఇటు హైదరాబాద్ జట్లకు ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో ఇరుజట్లు విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.
, ?
Our first game at Uppal is here! ante ento chupiddamu #PlayWithFire pic.twitter.com/fX0aBBOQif
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024