SRH vs GT : ప్రస్తుత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు ఓటములు ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్లు పట్టికలో దిగువ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. సొంత మైదానంలో గుజరాత్ జట్టుతో ఆడుతున్న మ్యాచ్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా సన్ రైజర్స్ ఓపెనర్లు అత్యంత చెత్తగా ఆడుతున్నారు.. ఇప్పటివరకు హైదరాబాద్ ఐదు మ్యాచ్లు అడగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు పై మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు తొలి వికెట్ కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.. ఇక ఆ తదుపరి మ్యాచ్లలో నిరాశజనకమైన భాగస్వామ్యాలు నిర్మిస్తున్నారు.
Also Read : ధోని రిటైర్మెంట్.. సంకేతాలివే..
అత్యంత దారుణం..
రాజస్థాన్ రాయల్స్ జట్టు పై 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హైదరాబాద్.. ఆ తర్వాత ఆ స్థాయిలో భాగస్వామ్యాన్ని నెలకొల్పలేదు.. లక్నో జట్టుపై 13 బంతుల్లో 15 పరుగులు.. ఢిల్లీ క్యాపిటల్స్ పై 11 పరుగులు..కోల్ కతా నైట్ రైడర్స్ పై నాలుగు పరుగులు.. గుజరాత్ టైటాన్స్ పై 9 పరుగులు మాత్రమే హైదరాబాద్ ఆటగాళ్లు తొలి వికెట్ కు భాగస్వామ్యం నెలకొల్పారు. అభిషేక్ శర్మ, హెడ్ గొప్ప ఓపెనర్లు అయినప్పటికీ.. ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు..మ్యాచ్ మ్యాచ్ కు తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18), హెడ్(8) స్వల్ప పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. వీరిద్దరు కూడా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఔట్ అయ్యారు. ఇక 17 పరుగులు చేసిన ఇషాన్ కిషన్(Ishan kishan) ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. “హైదరాబాద్ ఓపెనర్లు దారుణంగా ఆడుతున్నారు. కనీసం 50 పరుగుల భాగస్వామ్యం కూడా నిర్మించలేకపోతున్నారు. గొప్ప ఆటగాళ్లు ఇలా ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడం లేదు. హైదరాబాద్ జట్టు ఓపెనర్లు అంటే అద్భుతంగా ఆడుతారు. కానీ వరుసగా నాలుగు మ్యాచ్లలో విఫలమయ్యారు.. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటములు ఎదుర్కొంటున్నదని” సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
Also Read : ధోని మెరుపు రనౌట్.. బిత్తర పోయిన అశు తోష్ శర్మ