SRH : ఉప్పల్ స్టేడియంలో భారీ పరుగులు నమోదైన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడా పంజాబ్ జట్టుపై గెలిచింది. హైదరాబాద్ జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ 141 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్ల తర్వాత అతడి అసలు సిసలైన బ్యాటింగ్ స్వరూపాన్ని ప్రదర్శించాడు. అతడు బ్యాటింగ్ పేరుకు హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం పూనకం ఊగిపోయింది. హైదరాబాద్ అభిమానులు అభిషేక్ పేరును మంత్రంలాగా జపించారు. ఇక ఈ విక్టరీతో హైదరాబాద్ జట్టు పాయింట్స్ టేబుల్ లో టెన్త్ ప్లేస్ నుంచి 8వ స్థానానికి వచ్చింది. లాస్ట్ ప్లేస్ లో చెన్నై సెటిల్ అయింది.. ఇక పంజాబ్ జట్టుపై మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ వాస్తవానికి 35(11) పరుగుల వద్ద పెవిలియన్ చేరుకోవాల్సి ఉండేది.. అయితే ఆ సమయంలో యశ్ ఠాకూర్ వేసిన బంతిని అభిషేక్ శర్మ మాసివ్ స్ట్రోక్ తో ఆడాడు. అప్పటికి ఆ బంతి గాల్లో ఎగరడంతో.. బౌండరీ లైన్ వద్ద ఉన్న శశాంక్ సింగ్ పట్టేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా పంజాబ్ జట్టులో ఆనందం నెలకొంది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
Also Read : కాటేరమ్మ కొడుకు.. పంజాబ్ పై చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..
నో బాల్
యశ్ ఠాకూర్ గీత దాటి బంతి విసరడంతో అది నో బాల్ అయింది.. ఫలితంగా అభిషేక్ శర్మ కు జీవదానం లభించింది. లేకపోతే హైదరాబాద్ జట్టుకు భారీ ఉపద్రవం ఎదురయ్యేది. మరో ఓపెనర్ హెడ్ క్రీజ్ లో ఉన్నప్పటికీ.. అతడు తన స్థాయికి తగ్గట్టు ఆడలేక పోతున్నాడు. అభిషేక్ శర్మ లాగా భారీగా హిట్టింగ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే పంజాబ్ జట్టు విధించిన 246 టార్గెట్ ను హైదరాబాద్ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇక యష్ ఠాకూర్ నో బాల్ వేయడం తో ఆ తర్వాత బంతికి ఫ్రీ హిట్ లభించింది. దానిని అభిషేక్ శర్మ అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఆ బంతిని మరింత బలంగా కొట్టడంతో వేగంగా సిక్సర్ గా వెళ్ళింది. దీంతో అటు జీవధానం.. ఇటు సిక్సర్ లభించడంతో హైదరాబాద్ జట్టుకు ఎదురులేకుండా పోయింది. ఇక అప్పటినుంచి అభిషేక్ శర్మ మరింత దూకుడుగా ఆడాడు. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఊర మాస్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. అదే కాదు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇంకా తదుపరి మ్యాచ్లో కూడా హైదరాబాద్ ఇదే తీరుగా సత్తా చూపిస్తే తిరుగు ఉండదు.
Also Read : అభిషేక్ శర్మ వైల్డ్ ఫైర్ సెంచరీ.. ఉప్పల్ లో ఉడ్తా పంజాబ్!