Rajamouli and Mahesh babu : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)… ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మహేష్ బాబు (Mahesh Babu) లాంటి స్టార్ హీరోతో సైతం ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నాయి. తద్వారా ఆయన చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఆయన ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు అతనితో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా సందర్భంలో వాళ్ళందరిని పక్కన పెట్టి మహేష్ బాబుతో మాత్రమే పాన్ వరల్డ్ సినిమా చేయడానికి గల రీజన్ ఏంటి అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. అదే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ ఇప్పటికి పది సంవత్సరాల నుంచి ఒక టాక్ అయితే బయట నడుస్తోంది. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాకు కమిట్ అయి చాలా సంవత్సరాలు గడుస్తున్నా నేపథ్యంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా అయితేనే బాగుంటుంది. మహేష్ బాబు అయితేనే హాలీవుడ్ హీరోలా చూపించొచ్చని ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడు.
Also Read : రాజమౌళి మహేష్ సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాడా..?
అందువల్లే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తోడుగా గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు మన దర్శకులు వాళ్లకు కథలను చెప్పాలంటే ఆ కథలను కూడా వినేవాళ్ళు కాదు.
మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి వచ్చి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజమౌళితో వాళ్లు సినిమా చేయాలని అనుకున్నా రాజమౌళి వాళ్ళతో సినిమా చేయకపోవడానికి కారణం ఒకానొక సందర్భంలో వాళ్లతో సినిమా చేయాలనుకుంటే బాలీవుడ్ హీరోలు ఎవరు రాజమౌళి పట్టించుకోలేదు.
అందువల్లే వాళ్ల మీద కోపంతోనే బాహుబలి (Bahubali) సినిమా చేసి భారీ హిట్టు అందుకొని ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక మహేష్ బాబు అయితేనే హాలీవుడ్ కి న్యాయం చేయగలరనే ఉద్దేశ్యంతో అతన్ని ఈ సినిమాలో హీరోగా ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ఆ మూవీ చూసి మహేష్ బాబు మీద కోపాన్ని పెంచుకున్న రాజమౌళి…