SRH vs PBKS : ఎడమ చేతివాటంతో విచ్చలవిడిగా కొట్టేశాడు. బంతిని మైదానం నలుమూలలా పరుగులు పెట్టించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకుఈ స్థాయిలో ఎవరూ ఆడలేదంటే.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ బౌలర్ల పై దీర్ఘకాలిక శత్రుత్వం ఉన్నట్టు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేశాడు. అసలు ఏమాత్రం భయపడకుండా బంతిని వీర కొట్టుడు కొట్టాడు. బ్యాట్ విరిగేలా.. బంతి పగిలేలా దంచి దంచి కొట్టాడు. అసలు అతడు ఆడుతున్న ఆట తీరు చూసి ఉప్పల్ స్టేడియం మొత్తం ఊగిపోయింది. అసలే సొంత ప్రేక్షకుల బలం ఎక్కువగా ఉండే ఉప్పల్ మైదానంలో… అభిషేక్ శర్మ ఆడిన తీరు మరో స్థాయికి తీసుకెళ్ళింది.
అరదైన రికార్డు
పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా అభిషేక్ శర్మ సరికొత్త రికార్డును సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే అతడు సెంచరీ పూర్తి చేసుకుని అరుదైన ఘనతను తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇక ఈ జాబితాలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైనసెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో గేల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున పూణే వారియర్స్ జట్టుతో 2013లో జరిగిన మ్యాచ్లో.. గేల్ 30 బంతుల్లోనే శతకం కొట్టేశాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున యూసఫ్ పటాన్ 2010లో ముంబై ఇండియన్స్ జట్టు పై 37 బంతుల్లో సెంచరీ చేశాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్ 2013లో 38 బాల్స్ లో బెంగళూరు జట్టు పై సెంచరీ చేశాడు.
2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు హెడ్ బెంగళూరు జట్టుపై 39 బాల్స్ లోనే సెంచరీ చేశాడు..
2025లో చెన్నై జట్టుతో ముల్లాపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య 39 బాల్స్ లోనే శతకం కొట్టేశాడు.
2025లో ఉప్పల్ వెన్యూ లో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ జస్ట్ 40 బాల్స్ లో సెంచరీ నమోదు చేశాడు. 55 బంతులు ఫేజ్ చేసిన అభిషేక్ 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141 రన్స్ చేశాడు.
పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ వికెట్ కు అభిషేక్ శర్మ, హెడ్ 12.2 ఓవర్స్ లో 171 రన్స్ కొట్టేశారు.. ఐపీఎల్ లో ఈ సీజన్లో ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు తరఫున ఫస్ట్ వికెట్ కు ఈ స్థాయిలో భాగస్వామ్యం నమోదు కాలేదు. చేదించాల్సిన స్కోర్ భారీగా ఉన్న నేపథ్యంలో.. హైదరాబాద్ ఆటగాళ్లు ఎదురు దాడిని నమ్ముకున్నారు. చివరికి పంజాబ్ జట్టుకు చుక్కలు చూపించారు.