SRH vs PBKS : ఉప్పల్ వేదికగా శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్(kings XI Punjab) పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎదురుదాడికి దిగింది.. ముఖ్యంగా హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (100* 41 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు), హెడ్(66) ఉప్పల్ రాజీవ్ గాంధీ మైదానంలో వైల్డ్ ఫైర్ లాగా రెచ్చిపోయారు. వీరిద్దరు తొలి వికెట్ కు ఎవరు ఊహించని విధంగా 171 రన్స్ కొట్టేశారు. దీంతో పంజాబ్ జట్టు విధించిన 246 రన్స్ టార్గెట్ చిన్న పోయింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ చేశాడు . ఏ బౌలర్ ను కూడా వదిలిపెట్టలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు అభిషేక్ శర్మ తన లెవెల్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడం మొదలైంది. అసలు అతడిని ఓపెనర్ గా పక్కన పెట్టాలని డిమాండ్లు వచ్చాయి. అయినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ పట్టు పట్టి అభిషేక్ శర్మను ఓపెనర్ స్థానంలోనే ఉంచింది. అయితే తనదైన రోజు ఎలా ఆడతాడు అభిషేక్ శర్మ నిరూపించాడు. సాధారణంగా హెడ్ దూకుడుగా ఆడతాడు. కనికరం లేకుండా బౌలర్ల పై విరుచుకుపడతాడు. కానీ హెడ్ కాస్త తన శైలికి భిన్నంగా ఆడితే.. అభిషేక్ మాత్రం ఊర మాస్ బ్యాటింగ్ తో ఉప్పల్ మైదానాన్ని హోరెత్తించాడు. తొలి వికెట్ కు 171 రన్స్ పార్ట్నర్ షిప్ నిర్మించిన అభిషేక్ శర్మ, హెడ్.. ఇదే జోరు చివరి వరకు కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ యజువేంద్ర చాహల్ బౌలింగ్లో హెడ్ 66 పరుగుల వద్ద మాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 37 బంతులు ఎదుర్కొన్న హెడ్ 9ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు..
ఫామ్ లోకి వచ్చాడు
ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా అభిషేక్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. ఇక తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు ఇషాన్ కిషన్ సెంచరీ చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఇన్ని రోజులకు హైదరాబాద్ ఆటగాడు, అందులోనూ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ చేయడం విశేషం. కొద్దిరోజులుగా అతడు ఫామ్ లేమీ తో ఇబ్బంది పడ్డాడు. కీలకమైన మ్యాచ్లలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సూపర్ సెంచరీ చేయడం ద్వారా అభిషేక్ శర్మ ఒక్కసారిగా టాప్ గేర్ లోకి వచ్చాడు. ఎడమ చేతివాటం బ్యాటింగ్ స్టైల్ ను చూపించే అభిషేక్ శర్మ.. పంజాబ్ బౌలర్ల ను ఊచ కోత కోశాడు. అభిషేక్ శర్మను అవుట్ చేయించడానికి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపు 8 మంది బౌలర్లను రంగంలోకి దించాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. అర్ష్ దీప్ సింగ్ నుంచి మొదలుపడితే శశాంక్ సింగ్ వరకు బౌలింగ్ వేసినప్పటికీ.. అభిషేక్ శర్మ ఏమాత్రం భయపడలేదు. పైగా ఉప్పల్ మైదానంలో పంజాబ్ జట్టుకు ఉడ్తా పంజాబ్ సినిమా 70 ఎం ఎం లో చూపించాడు.
THIS IS PEAK T20 BATTING BY SRH pic.twitter.com/oJzrUKCbDt
— Johns. (@CricCrazyJohns) April 12, 2025