Abhishek Sharma : పంజాబ్ జట్టుపై ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ కొత్త దేవుడయ్యాడు. “మా కోసం పుట్టావయ్య.. మాకోసం ఆడావయ్య..” అంటూ పాటలు పాడుతున్నారు. వేగానికి కొలమానమైన.. దూకుడుకు అసలు సిసలు నిర్వచమైన ఐపీఎల్ లో అభిషేక్ శర్మ చేసిన సెంచరీ హైదరాబాద్ అభిమానులను మైదానంలో డ్యాన్స్ చేయించింది. పూనకమెత్తినట్లు ఆడినా, మన అభిషేక్ శర్మ ఐపిఎల్ లో బెస్ట్ కాదు… తనకంటే వీర బాదుడుగాళ్ళు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
5.ఎబి డివిలియర్స్, 133* vs MI
వీర బాదుడుగాళ్ళ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న ఐకానికి ఆటగాడి పేరు ఎబి డివిలియర్స్. బెంగళూరు జట్టుకు ఆడిన ఇతడు 2017లో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 59 బంతుల్లోనే 133* పరుగులు చేశాడు. అక్కడికి ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 225.42 గా ఉంది. ఈ మ్యాచ్లో 13 పరుగులకే గేల్ వికెట్ ను బెంగళూరు కోల్పోయింది. అప్పటికి కెప్టెన్ విరాట్ 50 బంతుల్లో 82 పరుగులు చేశాడు. వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన డివిలియర్స్ ముంబై బౌలర్ల బౌలింగ్ చిత్తు చేశాడు. మలింగ మినహా మిగతా బౌలర్లు మొత్తం చేతులెత్తేశారు. ఫలితంగా బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే 235 రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్లు కోల్పోయి 196 పరుగుల వద్ద ఆగిపోయింది.
4.క్వింటన్ డికాక్- 140* vs KKR, 2022
2022 ఐపిఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన క్వింటన్ డికాక్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై 70 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు.. స్ట్రైక్ రేట్ 200.. కెప్టెన్ కే ఎల్ రాహుల్ 51 బంతుల్లో 68* పరుగులు చేశాడు.. డికాక్, కేఎల్ రాహుల్ చివరి వరకు ఆడి.. 210 పరుగులు చేశారు. అయితే 211 పరుగుల టార్గెట్ తో కోల్ కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగి.. రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.
3.అభిషేక్ శర్మ – 141 vs PBKS, 2025
వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ ప్లేయర్ అభిషేక్ శర్మ. మరో ఓపెనర్ హెడ్ తో కలిసి పంజాబ్ విధించిన 246 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయడం మొదలుపెట్టాడు.. కేవలం 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 14 ఫోర్లు, పది సిక్సర్లతో 141 పరుగులు చేశాడు. ఇతని స్ట్రైక్ రేట్ 256.36 గా ఉండడం విశేషం. మరోవైపు హెడ్ కూడా 37 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఫలితంగా పంజాబ్ విధించిన లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే హైదరాబాద్ జట్టు చేదించింది.. మొత్తంగా ఎనిమిది వికెట్లు తేడాతో హైదరాబాద్ గెలిచింది. ఈ గెలుపు హైదరాబాద్ జట్టుకు పునర్జన్మ ప్రసాదించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2.బ్రెండన్ మెకల్లమ్ – 158* vs RCB , 2008
2008 ఐపీఎల్ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బ్రెండన్ మెకల్లమ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున బెంగళూరు పై విధ్వంసం సృష్టించాడు.. కెప్టెన్ సౌరవ్ గంగూలీతో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు బ్రెండన్ మెకల్లమ్. గంగూలి త్వరగానే అవుట్ అయినప్పటికీ..బ్రెండన్ మెకల్లమ్ చివరి వరకు ఉన్నాడు.. 73 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158* పరుగులు చేశాడు. 216.43 సగటు సాధించాడు.. ఈ మ్యాచ్లో కోల్ కతా 222 పరుగులు చేసింది.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 82 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 140 పరుగుల భారీ తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది..
1.క్రిస్ గేల్ – 175*vs PWI, 2013
యూనివర్సల్ బాస్ గా పేరుపొందిన క్రిస్ గేల్ 2013 ఐపిఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 175* పరుగులు చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. తిలక్ రత్నే దిల్షాన్ తో కలిసి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన గేల్.. పూణే వారియర్స్ పౌడర్ల పై ఎదురుదాడికి దిగాడు. గేల్ కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి.. గేల్ 265.15 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. అయితే ఈ మ్యాచ్లో 20 ఓవర్లకు బెంగళూరు ఐదు వికెట్ల నష్టానికి 263 రన్స్ చేసింది. పూణే 20 ఓవర్లలో 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. 175 పరుగులు మాత్రమే కాదు గేల్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. తద్వారా బెంగళూరు 130 పరుగుల భారీ తేడాతో విజయం నమోదు చేసింది.. 2013లో గేల్ నెలకొల్పిన 175* పరుగుల టార్గెట్ ను ఇప్పటివరకు కూడా మరే ఆటగాడు బ్రేక్ చేయలేకపోవడం విశేషం.