Homeక్రీడలుక్రికెట్‌Smaran Ravichandran: SRH నుంచి మరో రేసుగుర్రం.. ఎవరీ స్మరణ్ రవిచంద్రన్.. ఎక్కడతను..

Smaran Ravichandran: SRH నుంచి మరో రేసుగుర్రం.. ఎవరీ స్మరణ్ రవిచంద్రన్.. ఎక్కడతను..

Smaran Ravichandran: ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు దూసుకుపోతోంది. వరుస విజయాలతో దాదాపు ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. ఇకపై జరిగే మ్యాచ్ లలో హైదరాబాద్ గనుక విజయాలు సాధిస్తే కచ్చితంగా టాప్ 1 లేదా 2వ స్థానంలో ఉంటుంది.

ప్లే ఆఫ్ లో కూడా హైదరాబాద్ జట్టు ఇదే జోరు కొనసాగిస్తే.. 2024లో కోల్పోయిన ట్రోఫీని 2026 లో అందుకునేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ జట్టులో ఈసారి ఆటగాళ్లు అత్యంత కీలకంగా ఆడుతున్నారు. అందులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. ఆదివారం నాటి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరుగుతున్న మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు. అనారోగ్యం వల్ల అతడు తీసుకుంటున్నాడు.

నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో స్మరణ్ రవిచంద్రన్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. 22 సంవత్సరాల ఎడమచేతి వాటం తో ఉన్న ఈ ఆటగాడు తన తొలి ఐపిఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇతడికి డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన నేపథ్యం ఉంది. 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 73.04 సగటుతో 1534 పరుగులు చేశాడు. ఇందులో అతనికి మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.. ఇతడి హైయెస్ట్ స్కోర్ 227.. 18 లిస్ట్ ఏ గేమ్ లలో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. 13 t20 లలో 162.45 స్ట్రైక్ రేట్ తో 489 పరుగులు చేశాడు.

స్మరణ్ ను హైదరాబాద్ యాజమాన్యం 30 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో గాయం వల్ల అతడు మైదానంలోకి అడుగుపెట్టలేదు. 2026 సీజన్ లో మాత్రం అతడు తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. కర్ణాటక క్రికెట్లో అత్యంత వేగంగా ఎదిగిన ఈ ఎడమ చేతివాటం బ్యాటర్.. 2024-25 సీజన్ లో కర్ణాటక జట్టు తరఫున అరంగేట్రం చేశాడు.. విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ లో 101 పరుగులు చేశాడు.. ఆ మ్యాచ్ గెలిపించాడు. రంజీ ట్రోఫీలో పంజాబ్ జట్టు మీద 203 పరుగులు చేసి అదరగొట్టాడు.

2025-26 సీజన్ లో ఇతడు కేరళ మీద 220* పరుగులు చేశాడు. చండీగఢ్ మీద 227 రన్స్ చేశాడు. హర్యానా జట్టు మీద 133* పరులు చేశాడు.. 2022 -23 లో బెంగళూరు కేఎస్ సీ ఏ డివిజన్ లీగ్ లో 647 పరుగులు చేశాడు. ఇతడికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విజయ్ మర్చంట్ ట్రోఫీలో 617 పరుగులు చేశాడు. కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన తొలి మ్యాచ్ లో నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular