Viral Video : మొన్నటిదాకా త్రీ జీ. నిన్నటిదాకా ఫోర్ జీ.. ఇప్పుడేమో ఫైవ్ జీ.. దీనికి తోడు పెరిగిన సోషల్ మీడియా వినియోగం.. ఫలితంగా కొత్త కొత్త వీడియోలు.. రకరకాల ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని ఆలోచింపజేస్తే.. మరికొన్ని భయాన్ని కలగచేస్తాయి. ఇంకా కొన్ని పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తాయి. అయితే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
అది యమా రద్దీగా ఉండే సెల్ ఫోన్ షాప్. ఆ షాప్ ఓనర్ కస్టమర్లను డీల్ చేస్తున్నాడు. వారి ఫోన్లకు సంబంధించిన సమస్యలు వింటున్నాడు. ఆ పని పూర్తయిన తర్వాత వాటిని రిపేర్ చేస్తున్నాడు. ఈలోగా ఆ షాప్ లోకి పొగరుబోతు ఎద్దు ఎంట్రీ ఇచ్చింది. దాని రాకను ఊహించని ఆ షాపు ఓనర్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. పైగా ఆ ఎద్దు విపరీతమైన కోపంతో ఉంది. దాని నుంచి కాపాడుకునేందుకు ఆ షాపు ఓనర్, ఇతర కస్టమర్లు బయటికి వెళ్లాలని ప్రయత్నించారు. కానీ, అక్కడున్న పరిస్థితులు వారికి అనుకూలించలేదు. ఈ క్రమంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి.
వాస్తవానికి ఆ షాప్ ఓనర్ ఒక ఫోన్ రిపేర్ చేస్తున్నాడు. కొంతమంది కస్టమర్లు ఆ షాప్ లో ఉన్నారు. ఈలోగా ఏదో శబ్దం వినిపించింది. ఏంటని వారు లేచి చూసేసరికి ఓ పొగరుబోతు ఎద్దు ఆ షాప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు కస్టమర్లు, షాపు ఓనర్ దాని బారి నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికి కూడా ఆ ఎద్దు అక్కడే చాలా సేపు ఉంది. బయట ఉన్న వ్యక్తులు ఆ ఎద్దును బయటికి పంపేందుకు చాలాసేపు ప్రయత్నించారు. ఈ సంఘటన ఢిల్లీలోని సంఘం విహార్ లో జరిగినట్టు ఆ వీడియోను చూస్తే తెలుస్తోంది. షాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎద్దు బీభత్సం చేయడంతో అందులోని పరికరాలు ధ్వంసం అయ్యాయి. షాప్ ఓనర్ కు నష్టం వాటిల్లింది. ట్విట్టర్ ఎక్స్ లో chirag Barjatya ఐడీ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియో అసంపూర్తిగా ఎండ్ అయింది. ఎద్దు తర్వాత బయటికి వచ్చిందా? లేక ఇంకా మరికొన్ని షాపులలో ఇలానే ప్రవేశించి ధ్వంసం చేసిందా? అనే విషయాలపై క్లారిటీ లేదు. ఈ వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో లక్షల మంది చూశారు. బాబోయ్ ఇదేం ఎద్దు అని కామెంట్స్ చేస్తున్నారు.
Question: “What is your wildest dream?”
Answer: pic.twitter.com/3t0YW5XZ3f
— Chirag Barjatya (@chiragbarjatyaa) April 23, 2024